తెలంగాణ రాజకీయాలలో అధికార పార్టీ టిఆర్ఎస్ లో తాజాగా ఒక పుకారు వార్త షికారు చేస్తోంది. ఈ వార్త విని ప్రతిపక్ష పార్టీలు మరియు అదే విధంగా తెలంగాణలో ఉన్న మీడియాలో కూడా రకరకాల కథనాల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. విషయంలోకి వెళితే తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు దానికి ముహూర్తం కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు కేసీఆర్ యాగం తర్వాత అధికార పార్టీ టిఆర్ఎస్ లో భారీగా మార్పులు ఉండబోతున్న ట్లు పుకార్లు చాలా గట్టిగా తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్నాయి. రెండవసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ ఆరు సంవత్సరాలు పదవీకాలం చేపట్టడంతో తన స్థానంలో తన తనయుడు కేటీఆర్ ని ఇప్పటి నుండే రంగంలోకి దింపటానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇదే కథనంపై రెండు రోజుల నుండి వరుస కథనాలను ప్రచురించటం తో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

విషయంలోకి వెళితే వచ్చే ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ త్యాగం చేయబోతున్న విషయం అందరికీ తెలిసినదే. యాగం పూర్తయిన వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానం నుండి తప్పుకొని కొడుకు కేటీఆర్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడనికి కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు అయితే ఫుల్ పవర్స్ మొత్తం తన దగ్గర పెట్టుకుని కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే కేటీఆర్ ని కుర్చీలో కూర్చోబెట్టి తెలంగాణ రాజకీయాన్ని శాసించే విధంగా కెసిఆర్ సరికొత్త రాజకీయ అడుగులు వేయబోతున్న ట్లు సమాచారం.

 

ఇదే తరుణంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పదవి చేపట్టడానికి రెడీ అవుతున్నట్లు ఇందుమూలంగానే ఒకపక్క తన స్థానంలో తన కొడుకు కేటీఆర్ కూర్చోబెట్టి అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ కేసీఆర్ తనదైన శైలిలో రాజకీయా చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నట్లు పుకార్ల వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: