తెలుగుదేశం పార్టీ పతనం 2018 నుంచి మొదలైంది.  2018లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని విమర్శించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి బాబుగారు పతనం మొదలైంది.  ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  తాను స్వయంగా విమర్శించిన పార్టీతో ఎలా కలిసి పనిచేస్తానని చెప్పారు.  బాబు కూడా కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించి తీసుకున్న నిర్ణయాలు కేసుల బాబు ఓటమికి కారణాలయ్యాయి.  


2018 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమిపేరుతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది.  కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, తిరిగి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.  తెలుగుదేశం, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేయడం వలన ఒకవేళ తెలుగుదేశం పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చి గెలిపిస్తే దానివలన మరలా రాష్ట్రంలో బాబుగారు అరాచకాలు ఉంటాయేమో అని చెప్పి అందరు తెరాస కు ఓటేశారు.  


పాపం కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ప్రాంతాల్లో కూడా ఓటమిపాలైంది.  ఇది ఆ పార్టీకి తీరని దెబ్బ అని చెప్పాలి.  నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒక కారణం అని చెప్పొచ్చు.  అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూకట్ పల్లి నియోజకా వర్గం సీటును నందమూరి సుహాసినికి కట్టబెట్టింది.  అప్పటి వరకు ఆమె ఎవరో కూడా బయటకు తెలియదు.  ఎప్పుడు ఎక్కడా ఆమె కనిపించలేదు.

 
హరికృష్ణ కూతురు అనే విషయం తెలుగుదేశం పార్టీలో సీటు ఇచ్చేవరకు తెలియదు.  ఎవరో తెలియకుండా సీటు హడావుడిగా సీటు ఇచ్చి, ఎదో అలా ప్రచారం చేస్తే సరిపోతుందా.. కూకట్ పల్లిలో ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తులు ఉంటె ఉండొచ్చు.  అంతమాత్రం చేత టిడిపి నిలబెట్టిన వ్యక్తికి, అందులోనే అసలు ఎవరికీ తెలియని వ్యక్తిని ఎలా ఎంచుకుంటారు.  ఓడిపోతుందని తెలిసి కూడా, ఏదో సీటు ఇవ్వాలి ఇచ్చాము.. ఓడిపోయింది. కాబట్టి ఇక ఆ కుటుంబాన్ని రాజకీయాల నుంచి పక్కన ఉంచొచ్చు అన్నది బాబుగారి ప్లాన్.  తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత దారుణంగా ఓటమిపాలైందో.. ఏపీలోను అలానే ఓడిపోయింది.  చివరకు లోకేష్ సైతం ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: