ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు చాలా వేడి వేడి గా సాగుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని పచ్చి అబద్ధాలు చెబుతూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు మొత్తం పచ్చి అబద్దాలు అంటూ జగన్ పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగస్తులకు ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయం చేసే విధంగా రాష్ట్రంలో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్సింగ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ద్వారా సర్వీస్ ఉద్యోగస్తులకు ఇవ్వబోతున్నట్లు జగన్ పేర్కొన్నారు.

 

ఇప్పటివరకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, ఆఖరికీ ఉద్యోగులు జీతాలు పొందాలన్నా, లంచం ఇవ్వాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితి ఉండకూడదని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నష్టపోకూడదని, వారికి పూర్తి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసినట్టు తెలిపారు.గత చంద్రబాబు హయాంతో ఆయన బంధువు భాస్కర్‌ నాయుడికి ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా, వారికి పూర్తిగా లబ్ధి చేకూర్చేందుకు, లంచాలకు తావులేకుండా పూర్తి జీతాలు అందించేందుకు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చే సదుద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను తీసుకొచ్చామని, ఈ విషయంలోనూ టీడీపీ బురద జల్లుతూ, రాజకీయం చేస్తూ.. దిక్కుమాలిన అబద్ధాలు చేస్తోందని చంద్రబాబు కి చెమటలు పటేలా జగన్ తనదైన శైలిలో అసెంబ్లీలో ఫైర్ అయ్యారు.

 

అంతేకాకుండా భవిష్యత్తులో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగస్తులు అభద్రతా భావం లేకుండా ఏర్పాటుచేసిన ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సౌర్సింగ్‌ సర్సీసెస్‌ ద్వారా ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఉద్యోగస్తులకు భరోసా ఇచ్చేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగాలను చంద్రబాబు హయాంలో చాలా నీచంగా రాజకీయంగా అమ్ముకున్నట్లు జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: