రాజకీయా చరిత్రలో చంద్రబాబుకు ఉన్న అనుభవం నలభై ఏండ్ల అనుభవం.. తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన తర్వాత ఎన్నడూ తోడు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిన చరిత్రలేదు. అయితే బీజేపీ.. లేకుంటే కమ్యూనిస్టులు.. చివరకు మొన్న తెలంగాణలో కాంగ్రెస్‌తో కూడా కలిసి పోటీచేసిన ఘనత వహించిన చంద్రబాబు నాయుడు. ప్రాంతీయ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన నేత. అవసరాన్ని బట్టి ఆయా పార్టీలతో జతకట్టి.. అవసరం తీరాక వదిలేసే కూటిల నీతిలో సాటిలేని నాయకుడు అని ఇప్పటికే ఏపీ ప్రజలు అనుకుంటున్నారట.

 

 

ఇకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా సాధారణంగా తమ నాయకుల్ని, తమ శ్రేణుల్ని.. అంతకుమించి తమ ప్రజాబలాన్ని నమ్ముకొని ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగుపెడు తుంది. ప్రజా క్షేత్రంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా కొన్నిసార్లు తమ ఎన్నికల వ్యూహాలకు పార్టీలు పదునుపెడతాయి. ఈ క్రమంలో తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీలతో జట్టు కడతాయి. అందులోనూ తమ పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా స్నేహ హస్తాన్ని అందిస్తాయి.

 

 

కానీ  ఇతర పార్టీల పొత్తు ఆధారంగానే తన పార్టీని ఎన్నికల్లో నడిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే. కాస్త ఆశ్చర్యమైనా ఇది నిజం. కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు.. ఆపై తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆపై జరిగిన రాజకీయ కీలక పరిణామాలు.. వెన్నుపోటు రాజకీయాల దరిమిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం పీఠం అధిష్ఠించారు.

 

 

ఇక ఇలా ఏ కాంగ్రెస్‌ను వ్య‌తిరేకిస్తూ ఎన్టీఆర్ పార్టీ పెట్టారో అదే కాంగ్రెస్‌తో క‌లిసి తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు... నాలుగు నెల‌ల‌కే మ‌ళ్లీ కాంగ్రెస్‌కు విడాకులు ఇచ్చి తనదారి తాను చూసుకున్నాడు.. ఇలా బాబు ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక పార్టీతో పొత్తులేకుండా ఇప్పటివరకు ముందుకు సాగని చరిత్రను భద్రంగా మూటగట్టుకున్నారు చంద్రన్న అని పబ్లిక్ టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: