వాడివేడిగా కొనసాగుతున్న రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ రోజు దాదాపు ఒకే రోజు ప్రభుత్వం పదహారు కీలక బిల్లులపై నిర్ణయం  తీసుకోబోతుంది. ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1982 సవరణ. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యార్థులకు భోదన. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.

 

ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం. ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.  చిరుధాన్యాల(మిల్లెట్స్‌) బోర్డు ఏర్పాటు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం. పౌష్టికాహారాన్ని అందించడం. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం. ధరలు పెరగడకుండా నియంత్రించడం. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం. పౌష్టికాహారాన్ని అందించడం. 

 

 అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా. ఆంధ్రప్రదేశ్‌ ఆబ్కారీ చట్టం–1968కు సవరణ.బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్‌ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. రెండోసారి పాల్పడితే బార్‌ లైసెన్స్‌ రద్దు, నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు. 

 

 కర్నూలులో సిల్వర్‌ జూబ్లీ కాలేజీ, కేవీఆర్‌ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం.  జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ . వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌/ప్రతినిధి ఎక్స్‌–అఫీషియో సభ్యునిగా నియామకం. విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్‌ల నియామక నిబంధనల్లో మార్పులు 

 

 సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం. ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు–2019. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు–2019 . ఏపీ మున్సిపల్‌ చట్టం సవరణ బిల్లు–2019   

మరింత సమాచారం తెలుసుకోండి: