ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లి తిరుగులేని మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. పన్నెండేళ్ల తర్వాత అనూహ్య పరిణామాల అనంతరం సీఎం పదవి.. పార్టీ పగ్గాలు కూడా చంద్రబాబు వశమయ్యాయి. ఆనాటి ఘటనలో పార్టీని కాపాడుకోవడానికి, లక్ష్మీపార్వతి అంశం నుంచి పార్టీని బతికించుకోవడం అనే కోణంలో చంద్రబాబు వేరు కూటమి తయారు చేశారు. ఆనాటి వైస్రాయ్ హోటల్ ఉదంతం ఇప్పటికీ చర్చనీయాంశమే. ఇక్కడ చంద్రబాబుకు పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా తన వైపుకు తిప్పుకోగలిగారు.

 

 

ఇక్కడ చంద్రబాబు యుక్తికి నంద‌మూరి ఫ్యామిలీ మొత్తం బ‌లైంది. హరికృష్ణ, బాలకృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు సాయంతో ఆయన ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కూటమి పెట్టారు. అయితే సీఎం పీఠం హస్తగతమయ్యాక హరికృష్ణకు, దగ్గుబాటిని దూరం పెట్టాడు. హరికృష్ణకు మంత్రి పదవి ఆశ చూపి మోసం చేసాడు. ద‌గ్గుబాటికి కూడా ఉప ముఖ్య‌మంత్రి ఇస్తాన‌ని న‌మ్మ‌క‌ద్రోహం చేశాడు. తర్వాత బాబు తన తెలివితేటలతో వీరిరువురిని టీడీపీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా  పోయిందనేది నిజం. హ‌రికృష్ణ‌ స్వయంగా అన్న టీడీపీ అనే పార్టీ పెట్టుకునేలా చేసాడు. బాల‌య్య‌ను వియ్యంకుడిని చేసి నోటికి ప్లాస్ట‌ర్ వేశాడు.

 

 

ఎన్టీఆర్‌ను వాడుకుని 2009 ఎన్నిక‌ల్లో త‌ర్వాత లోకేష్ కోసం అణ‌గ‌దొక్కాడు. మిగిలిన వార‌సుల‌ను బెదిరించి... కొంద‌రిని త‌న వైపున‌కు తిప్పుకుని మాట్లాడ‌నీయ‌లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తెను బరిలో దింపి ఓటమి చూపించాడు. మొత్తంగా టీడీపీతో ఎన్టీఆర్ కుటుంబానికి సంభంధం లేకుండా చేశాడని చెప్పాలి. ఇప్పటికి నందమూరి వంశం నుంచి బాలయ్య మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నాడు. పురంధేశ్వరి మాత్రం ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మరెవరూ సొంత టీడీపీ పార్టీలోకి వచ్చి క్రియాశీలక పాత్ర పోషించలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: