7వ రోజు ఏపీ శీతాకాల సమావేశాల్లో ధర్మాన ప్రసాదరావు సుమారు 40 నిముషాలు పాటు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా రాజధాని ఏర్పడలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అసలు ఒక కొత్త రాజధాని ఏర్పడాలని ఎవరు సరిగా ప్రయత్నం చేయలేదని చెప్పారు. దీంతో ప్రజలందరిలో చాలా ఆవేదన ఉందని చెప్పారు. రాజధాని నిర్మించకుండా గ్రాఫిక్స్ తో 150 అడుగుల భవనాలు టీవీ లో చూపించి.. ప్రపంచంలోనే గొప్ప రాజధాని ఏపీలో రాబోతుందని ఊహాత్మకంగా చూపించారని పెదవి విరిచారు. రాజధానిని నిర్మించే సమయం ఉన్నపటికీ కాలక్షేపం చేసారని, ఒక నిర్ణయం తీసుకొని అమలు చేస్తే అది ఎవరికి ఇబ్బంది కలిగిస్తుందని ప్రశ్నించారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబుకు రాజధానిని కట్టకపోవడం ఒక విజ్ఞతతో తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. ఆయనకున్నటువంటి సపోర్ట్ తో రాజధానిని నిర్మించకుండా దబాయించారని, అది సరైంది కాదని తెలిపారు.


తన లాంటి వాళ్లు అమరావతికి వస్తే పరిస్థితి ఏమిటి అని అడిగారు.. 5 సంవత్సరాలు గడిచినా ఎక్కడ ఏ ఆఫీస్ ఉందో కూడా తెలియని పరిస్థితి లో ఉన్నానని బాధని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏమి చేయకుండా టీడీపీ పాలనని విజ్ఞతతో చేసినట్లు బూటకపు మాటలు చెప్పారని విమర్శించారు.


తాను రాజధాని గురించి చేసిన స్టడీ లో కొన్ని విషయాలను తెలుసుకున్నారని ఆ విషయాలను నిండు సభలో చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీని కొంతమంది నిపుణులతో కేంద్ర ప్రభుత్వం వేశారని చెప్పారు. ఆ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ లాంటి అనుభవజ్ఞులు ఉన్నారని, కానీ వారిని పని చేయనీయకుండా, వారికి సహకరించకుండా ఎంతో డబ్బును టీడీపీ దుర్వినియోగం చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఎక్సపర్ట్ కమిటీని నియమించిందని, అటువంటి చుట్టరూపైన కమిటీకి టీడీపీ ఏ మాత్రం సహకరించకుండా ప్రజలను మోసం చేసారని, అపహేళన చేసారని ఎద్దేవా చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: