తెలుగు దేశం పార్టీ అధినేత.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పది సంవత్సరాలలో ఎన్ని కథలు నడిపారు.. ఎన్ని రాజకీయాలు చేశారు ? అనేవి ఇక్కడ చదివి తెలుసుకోండి. అసలు అతను 2009 సంవత్సరంలో అంత ఘోరంగా ఓడిపోవటం ఏంటి ? 2019 ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోవటం ఏంటి అనేది.. ఓట్ల శాతం ఎందుకు అంత తగ్గింది ? 40 ఏళ్ళ ఎక్సపీరియన్స్ ఉన్న రాజకీయనాయకుడుకు ఇప్పుడు 23 సీట్లు రావడం ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఇంకా అసలు విషయంపై వస్తే.. ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపు 9 ఏళ్ళు పరిపాలించి ప్రజలను అష్టకష్టాలకు గురి చేసిన బాబోరు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచితనం వల్ల.. అతను పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ వల్ల బాబోరు 2004 సంవత్సరంలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. దీంతో 5 ఏళ్ళు ప్రతిపక్షనేతగా పనిచేసిన చంద్రబాబు 2009లో అయినా గెలుద్దాము అనుకున్నారు. 

 

కానీ చిరంజీవి పుణ్యమా అని అది సాధ్యం కాలేదు. కారణం చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ఈ పార్టీ వల్ల 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎన్ని ఓట్లు తగ్గాయో.. చంద్రబాబుకు అన్నే తగ్గాయి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అంత ఘోరంగా ఓడిపోయాడు అంటే ఒకరకంగా చిరంజీవి ఏ కారణం. అయితే ఇంకా అక్కడికి సిన్ కట్ చేస్తే.. రాష్ట్ర విభజన కారణంగా బాబోరు 2014లో గెలిచారు.   

 

2014లో గెలుపుకు కారణం ఒక వైపు రాష్ట్ర విభజన... మరో వైపు బీజేపీ మద్దతు.. ఇంకో వైపు పవన్ కళ్యాణ్ మద్దతు. ఇన్ని మద్దతులు ఇచ్చాక బాబోరు గెలవకుండా ఉంటారా ? అందుకే బాబోరు గెలిచారు. అదిగో ఇదిగో అంటూనే ప్రజలను 5 ఏళ్ళు ముప్పు తిప్పలు పెట్టి 2019 ఎన్నికలు వచ్చేసింది. కానీ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లు చీలిపోయాయి. దీంతో మరి దారుణంగా 23 సీట్లతో ఓడిపోయాడు చంద్రబాబు. ఇలా 2009లో అన్న చిరంజీవి అడ్డు వస్తే.. 2019లో తమ్ముడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అడ్డు వచ్చి పెద్ద దెబ్బ వేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: