భూమి పైన ఎప్పుడూ ఏదో ఒక విచిత్రం జరుగుతూనే ఉంటుందేమో అలాగే మన తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా అనాజీపురం గ్రామంలో ఒక వింత చోటుచేసుకుంది. కొన్ని వింతైన  చేపలు లభ్యమయ్యాయి. స్థానిక మూసీ వాగులో లచ్చయ్య అనే జాలరి వలకు ఇవి చిక్కాయి. రాత్రి వేసిన వలలో చిక్కిన ఈ చేపలను చూసి లచ్చయ్య ఆశ్చర్యపోయాడు. మామూలు చేపలకంటే ఇవి భిన్నంగా ఉన్నాయి. ఈ చేపలకు రెక్కలు మందంగా, పెద్దగా ఉన్నాయి.

ఆ చేపలను చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు.  అది తెలిసిన గ్రామస్థులు కొందరు ఫొటోలు తీసుకున్నారు. అయితే నిపుణులు మాత్రం ఇవి సముద్రాల్లో ఉండే చేపలని చెబుతున్నారు, డెవిల్ జాతికి చెందినవని భావిస్తున్నారు. మరి ఇవి తినడానికి పనికి వస్తుందా?  రాదా?  అని ఆలోచనలో పడ్డారు. అలాగే ఇలాంటి అరుదైన చేపలు ఇలా వచ్చాయని అదీ మూసి లోకి ఇలా వచ్చాయని సాధారణంగా మూసీలో అంత మురికి నీరే కదా అని వలలో పడ్డ చేపలన్నింటిని చేపల వ్యాపారి అంతయ్య కొనుగోలు చేశారు.

ఇక విచిత్రంగా ఉన్న ఈ చేపలు బతికే ఉండడం విశేషం. అది గమనించిన అంతయ్య మళ్ళీ ఆ చేపలను  లచ్చయ్య  తిరిగి ఇచ్చేసి వాటిని మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్లి తిరిగి మూసీ వాగులోవదిలేయమని చెప్పడం తో లచ్చయ్య మూసి లోకి వదిలేసాడు. ఈ మధ్య కాలంలో ఇటువంటి  విచిత్రమైన చేపలు తరచూ తెలంగాణలో అక్కడక్కడా నదులు, రిజర్వాయర్లలో ఇవి కనిపిస్తున్నాయి. జాలర్లకు మాటి మాటికీ ఇలాంటి చేపలే వలలో పడడం తో  చిరాకు తో వాటిని మళ్ళీ ముసిలోనే వేసేయడం తో వారికీ ఇబ్బందిగా ఉంది అని విచారం వ్యక్తం చేసారు. ఆర్థికంగా  కూడా ఇబ్బంది అవుతుంది అని వాపోతున్నారు.ఈ బాధలు ఇలా తప్పుతాయో అని మా బాధలు ఎవరికీ చెప్పాలని ఆవేదన వ్యక్తం చేసారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: