తెలుగు దేశం పార్టీ అధినేత.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అండి. పాపం.. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రను 40 ఏళ్ళ కుర్రోడు భూస్థాపితం చేశాడు. ఏ మాట మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం... నిజంగా.. పాపం చంద్రబాబు నాయుడు లీడర్ గా ఉండాలని చిన్నప్పటి నుండి ఎన్ని కళలు కానింటాడు. 

 

కానీ ఆ కళలు అన్ని నీరుగారాయి. చంద్రబాబు నాయుడు అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చాడు ? ఎప్పుడు వచ్చాడు ? ఎలా వచ్చాడు ? సీఎం ఎలా అయ్యాడు అనే ప్రశ్నలన్నింటికీ ఇక్కడ సమాదానాలు ఉన్నాయి. ఇంకా అసలు విషయానికి వస్తే.. కాలేజీలో చదివే సమయంలోనే రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు 1978 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యి మంత్రి అయ్యాడు. ఆ తర్వాత 1980 సంవత్సరంలో ఎన్టీఆర్ కూతురు అయినా భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. 

 

1982లో తెలుగు దేశంని స్థాపించారు. స్థాపించిన 9 నెలలలోనే ఎంటర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1989 నుండి 1994 కుప్పం నుండి  ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా 1995లో ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి 2004 వరుకు ఆ పదవి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. 2004లో ఆ పదవిని సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరుపున గెలుచుకున్నాడు. 2004 నుండి 2014 వరుకు ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాలు వ్యవహరించాడు. మళ్ళి 2014లో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నడు. 

 

అంతా కష్టపడి దాదాపు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి మరి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటే.. మళ్ళి 5 ఏళ్లకు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు 40 ఏళ్ళ కుర్రాడు జగన్ ముందు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు.. అది కూడా ఎంత ఘోరంగా అంటే.. పార్టీ చరిత్రలోనే లేనట్టుగా 23 సీట్లు గెలిచి ఓటమి పాలయ్యాడు. చెప్పాలంటే తన సొంత నియోజవర్గంలో కూడా కొన్ని రౌండ్లలో వెనకపడ్డాడు బాబు. ఇలాంటి పరిస్థితీ పార్టీ రావడానికి కారణం ఒకరకంగా చంద్రబాబు ఏ అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: