సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి పార్టీ ప్రజల్లో ఎంతో ఆదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే టిడిపి పార్టీ లోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు క్రమక్రమంగా టిడిపి నేతలందరినీ తనవైపు తిప్పుకొని... సీనియర్ ఎన్టీఆర్ నుంచి టిడిపి పార్టీ ని కైవసం చేసుకున్నారు అన్నది అందరికి తెలిసిన మాట . పార్టీ పగ్గాలను దక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం జరుగుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి పార్టీలో నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు... ఇంపార్టెంట్ ఇవ్వలేదన్నది కూడా  అందరికి తెలిసిందే. క్రమక్రమంగా నందమూరి ఫ్యామిలీ ని బాబోరు  పక్కన పెడుతూ వచ్చారు.

 

 

 

 ఇప్పటివరకు ఏ కీలక పదవిని కూడా నందమూరి ఫ్యామిలీకి కష్టపెట్టలేదు చంద్రబాబు నాయుడు. అయితే  నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి . అది కూడా కీలక పదవులు చేపట్టిన వారు చాలా తక్కువ మందే. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబును ప్రోత్సహిస్తూ.. చంద్రబాబు వెంటే  ఉన్నప్పటికీ హరిక్రిష్ణ కు మాత్రం చంద్రబాబు ఎక్కడ కీలక పదవి కట్టబెట్టిన  దాఖలాలు లేవు. కాగా  అటు నందమూరి బాలకృష్ణ మొదటిసారి 2014లో శాసనసభ స్థానానికి ఎన్నికైనప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఇలా రాజకీయాల్లో నందమూరి ఫ్యామిలీని పక్కన పెడుతూనే వచ్చారు చంద్రబాబు నాయుడు. 

 

 

 

 కాగా నందమూరి ఫ్యామిలీ ని పక్కన పెడుతూ వచ్చిన చంద్రబాబు ను కూడా ప్రజలు పెడుతూనే వచ్చారు. చంద్రబాబు కుళ్లు కుతంత్రాలతో కూడిన అవకాశవాద రాజకీయాలు గమనించిన తెలుగు ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ్యతిరేకించారు. దీంతో 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ను సైతం బరిలోకి దింపి ప్రచారం నిర్వహించినప్పటికీ కు కలిసి రాలేదు. అయితే 2009 ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ని వాడిన చంద్రబాబు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను  కూడా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ మద్దతు  కోసం బ్రతిమిలాడుకున్నారు . ఇక ఇవన్నీ గమనించిన తెలుగు ప్రజలు సమైక్య ఆంధ్రలో చంద్రబాబు ను పక్కన పెట్టారు. ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక  జనసేన మద్దతుతో మొదట గెలిచినప్పటికీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో  తెలుగు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో కేవలం 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బాబోరికి .

మరింత సమాచారం తెలుసుకోండి: