ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. పాపం.. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రను 40 ఏళ్ళ కుర్రోడు భూస్థాపితం చేశాడు. ఒక రకంగా అది మంచిదే లెండి.. లేకుంటే ఇప్పుడు ఉన్న ఆంధ్ర రాష్ట్రం కూడా మళ్ళి పదేళ్లకు ముక్కలు అయ్యేది ఈయన వల్ల. ఇంకా అసలు విషయంకు వస్తే.. ఒకరకంగా కాదు.. అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడే కారణం రాష్ట్ర విభజన కావడానికి. 

 

ఇంకా అసలు విషయంకు వస్తే.. చంద్రబాబుకు పాలించడం రాకనో తెలీదు.. రాష్ట్రం విడిపోవాలని చేసిందో తెలీదు.. అయన గారి వల్ల ఒక రకంగా రాష్ట్రం విడిపోయింది. 1995లో మొదటిసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. అదే మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం. అప్పుడు మొదలయింది రాష్ట్రం చీలటం. సరిగ్గా 20 సంవత్సరాలకు రాష్ట్రం రెండు ముక్కలు అయ్యింది. 1995 నుండి 2004 వరుకు అయన తొమ్మిదేళ్ళ పాలన అంతా అస్తవ్యస్తం. అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రీకృతం చేసేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు అయినా తెలంగాణ ఉత్తరాంధ్ర రాయలసీమలో అభివృద్ధి గాలికి వదిలేశారు. 

 

అక్కడే రాష్ట్ర విభజనకు బీజం పడింది ఫలితంగా ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న తెలుగు ప్రజలు విడిపోయారు. సరే అక్కడ ఒకవైపే అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. అలా ముక్కలు చెయ్యడం వాళ్ళ చంద్రబాబుకు ఒకరకంగా మంచే జరిగింది. విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మళ్లీ.. అదే తప్పు చేశారు. అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకృతం చేశారు ఫలితంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయ‌ల‌సీమ‌ ప్రజలు వెన‌క‌బాటుకు గురవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎం అర్థం అయ్యింది. ఇంకో ఐయుదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేతిలో రాష్ట్రాన్ని పుట్టింట మరో 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకో ముక్క అయ్యేది అని.. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: