టీడీపీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా బలహీనంగా ఉంది. ఎన్నికల్లో వైఎస్ ఆర్ సీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభంజనాన్ని సృష్టిస్తే, టీడీపీ మాత్రం కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం కావడం అందరిని ఆశ్చర్య పరిచింది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఓడిపోవడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చలకి దారి తీసింది. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు లాంటి నాయకుడే కరెక్టని అదొక్కటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని గెలిపిస్తుందని అనుకున్నారు. 

 

 

కానీ చాలా కారణాల వల్ల టీడీపీ ఓడిపోయింది. అయితే కేవలం తక్కువ సీట్లు రావడంతో పార్టీ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అదీ గాక చంద్రబాబు తర్వాత పార్టీని ముందుకు నడిపించే వారెవరనేది అస్పష్టంగా ఉంది. చంద్ర బాబు తనయుడు లోకేష్ పార్టీని ముందుకు నడిపించే వాడిగా కొంతమంది భావిస్తున్నప్పటికీ, మెజారిటీ పార్టీ నాయకుల్లో ఆయన నాయకత్వంపై నమ్మకం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

ముఖ్యంగా సీనియర్ నాయకుల్లో ఈ అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందని సమాచారం. అయితే ఈ విషయమై పార్టీ వర్గాల్లో చర్చలు నెలకొన్నాయట. చంద్రబాబు తర్వాత పార్టీ పెద్దగా చినబాబుకే ఆధిపత్యం అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారట. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీని నడిపించాలంటే చాలా అనుభవం అవసరం. అంత అనుభవం చినబాబు గారికి లేదన్న వాదన పార్టీ వర్గాలలో వినబడుతోంది.

 

దీనివల్ల పార్టీ కార్యకర్తలకి ఏం చేయాలో తెలియట్లేదు. సరైన నాయకుడి నాయకత్వంలో నడిస్తేనే పార్టీ భవితవ్యం బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ మేరకు కార్యకర్తలు కొంత ఇబ్బంది పడుతున్నారని సమాచారం. పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే కార్యకర్తలు బాగుండాలి. రూట్ లెవెల్ లో పని చేసేది కార్యకర్తలే కాబట్టి వాళ్ళు సరిగ్గా పనిచేస్తేనే పార్టీ ముందుకు నడుస్తుంది. మరి కార్యకర్తల్లోనే నమ్మకం కోల్పోతే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: