ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణలో నామమాత్రపు పాత్ర కూడా పోషించలేకపోయింది. చంద్రబాబు కూడా తెలంగాణలో టీడీపీ పార్టీకి ప్రాధాన్యత తగ్గించటంతో తెలంగాణలో టీడీపీ దయనీయ స్థితిలోకి వెళ్లింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్యమైన నేతలు పార్టీని వీడారు. 
 
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపిన తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు సాధించింది. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడున్నారో వెతుక్కునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. కొన్ని రోజుల క్రితం జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీకి 1827 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
 
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంటే హుజూర్ నగర్ ఉపఎన్నికలో స్వతంత్ర్య అభ్యర్థికే ఎక్కువగా ఓట్లు రావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి బలంగా ఉంటారనుకున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీ అనాథ అయింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండాలంటే ఎన్టీయార్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కొంతమంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఓటుకు నోటు కేసు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడటానికి ఒక కారణమని తెలుస్తోంది. మరోవైపు ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగానే ఉంది. 175 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో బాబు చేసిన పొరపాట్లు, తప్పుల వలనే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందని, ఏపీలో ప్రతిపక్షానికి పరిమితమైందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: