ఒకప్పటి పాకిస్తాన్ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కి ఆ దేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ న్యాయస్థానం ముషారఫ్ దోషిగా తేల్చడంతో శిక్ష ఖరారు అయ్యింది. ఈ మేరకు పెషావర్ హై కోర్ట్ తీర్పు వెల్లడించింది. శిక్ష పడిన నేపథ్యంలో కేసులో ముషారఫ్ చేత స్టేట్మెంట్ తీసుకోవాలని ఈ నెల 5 కల్లా రికార్డు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2007వ సంవత్సరంలో నవంబర్ మూడవ తారీకున పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో ఎమర్జెన్సీ విధించేందుకు అప్పట్లో ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్) ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

 

ఈ పిటిషన్ 2013 నుంచి పెండింగులో ఉంది. దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న ముషారఫ్ ను 2014 లో అభ్యర్థించారు కూడా. అయితే తన ఆరోగ్యం దృష్ట్యా ఆయన 2016 నుంచి దుబాయ్ లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తాను తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు రెడీ గా ఉన్నట్లు ఆయన దుబాయ్ లో ఆసుపత్రి మంచం మీద నుండి వీడియో మెసేజ్ రూపంలో ఇవడం జరిగింది. జ్యుడీషియల్ కమిషన్ ఇక్కడకు వచ్చి తన వాంగ్మూలాన్ని తీసుకోవాలని అలాగే తన ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించాలని గమనించాలని వీడియోలో ముషారఫ్ తెలిపారు.

 

దీన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అంటూ ముషారఫ్ అభ్యర్థించారు. ప్రస్తుతం ముషారఫ్ వయసు 76. ఇటువంటి పరిస్థితుల్లో ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తున్నట్లు వార్తలు రావడంతో పాటుగా తన తల్లి వృద్ధురాలైన నేపథ్యంలో తన తల్లి ఆరోగ్య స్థితిని కూడా దృష్టిలోకి తీసుకోవాలి తిరిగి తాను పాకిస్థాన్ దేశానికి రాలేను అన్నట్టుగా తన నిస్సహాయతను వీడియో లో ముషారఫ్ వ్యక్తం చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: