ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి నగరి ఎమ్మెల్యే రోజాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. వారిద్దరు ఎదురుపడి విమర్శలు చేసుకున్నారంటే మీడియాకు పండుగే. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అసెంబ్లీ సెషన్​ లోనైతే ఆ కిక్కేవేరు. ఫైర్​ బ్రాండ్​గా పేరొందిన రోజా.. అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై చండ్రనిప్పులు చెరుగుతోంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రోజా నోరు జారింది. 

 

రోజా.. ఆయన ఐదేళ్ల పాలను ఇంకా మర్చిపోట్టుంది. అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం చంద్రబాబుని.. ‘ముఖ్యమంత్రి’అని  సంబోధించి ఫైర్​ బ్రాండ్​ అబాసుపాలైంది. అసెంబ్లీ సమావేశాల్లో మద్యపాన నిషేదంపై చర్చపై ఆమె మాట్లాడిన సందర్భంలో ఒక పక్క జగన్‌ని పొగుడుతూనే.. మరోపక్క చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మద్యపాన నిషేధం కోసం ముఖ్యమంత్రి చేస్తోన్న ప్రయత్నాన్ని రాష్ట్రంలో ప్రతీ మహిళా అభినందిస్తోందని.. ఏ సీఎం చేయనటువంటి.. పేదరికాన్ని శాశ్వతంగా రూపు మాపేందుకు కృషి చేస్తున్నారన్నారు.

 

Image result for chandrababu and roja

 

ఈ సందర్భంగా చంద్రబాబును విమర్శిస్తూ మాజీ సీఎం చంద్రబాబు మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి మాట తప్పారని.. గత ప్రభుత్వ హయాంలో మద్యం ఏరులై పారిందని.. దీని వల్ల ఎంతో మంది మహిళలు రోడ్డున పడ్డారని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో కృష్ణానదిలో వరద బదులు.. ‘మద్యం’ ఏరులై ప్రవహించిందని.. దీనిపై మాట్లాడటానికి ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి లేరని.. దీనిపై సమాధానం చెప్పలేరు కాబట్టే పారిపోయారని’ ఆమె వ్యాఖ్యానించారు. కొద్ది సేపట్లోనే తేరుకున్న ఆమె సారీ.. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు పారిపోయారని అన్నారు. గతంలో కూడా ఆమె ఇలానే మాట్లాడి హైలైట్ అయ్యారు. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రోజాముఖ్యమంత్రి ఉన్నాడు అసలు. ఆడవాళ్ల పుట్టకనే అవమానిస్తాడు’’ అని వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: