దేశంలో కొన్ని సంవత్సరాల తరువాత రాజకీయం సమూలంగా మారిపోయంది. స్వాతంత్ర్య  పోరాటంలో పాల్గొన్న  ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ని స్వాతంత్ర్య అనంతరం నుండి  గాంధీ వారసులు పాలిస్తున్న ఆ పార్టీని దేశంలో అసలు అధికారం లో లేకుండా చేసిన బీజేపీ పార్టీ దేశంలో ఏకైక పెద్దపార్టీగా మలచిన మోదీ మరియు అమిత్ షా లు కేంద్ర కీలక నేతలుగా  నిలబెట్టింది.

ఇప్పుడు బీజేపీ అన్ని రాష్ట్రాలలో తన పెత్తనం చెలాయిస్తున్న ఈ పార్టీ బెంగాల్ లో మాత్రం నిరాశే చవి చూసింది అక్కడి సీఎం అభ్యర్థిని తట్టుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే అక్కడున్నది దీదీ గా పేరుతెచ్చుకున్న మమతా బెనర్జీ. ఈ మధ్య ఏదో మీటింగ్ లో  హింసాత్మ‌క ఆందోళ‌న‌లు చేప‌డుతున్న వారిని మరియు వాళ్లు వేసుకున్న దుస్తుల ద్వారా గుర్తుప‌ట్ట‌వ‌చ్చు అని ప్ర‌ధాని మోదీ  కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్య‌పై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ప్రధాని మాటలు అయన అధికారానికి ఆమోదయోగ్యం కాదని అయన లెవెల్ కి అవి సరిపోవని ఒకరి బట్టల ద్వారా మనిషిని అంచనా వేయొచ్చు అన్న అతడి కామెంట్స్ ని తీవ్రంగా ఖండించింది.

డ్రెస్ కోడ్ ఆధారంగా ఓ వ్య‌క్తిని గుర్తించ‌డం ఆమోదించ‌ద‌గ్గ విష‌యం కాదు అని మ‌మ‌తా అన్నారు. ఇవాళ‌ రెండ‌వ రోజు కోల్‌క‌తాలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ క్యాబ్‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టారు. సినీ తార‌లు, తృణ‌మూల్ ఎంపీలు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. స‌మావేశానికి వ‌చ్చిన భారీ జ‌న‌స‌మూహాన్ని ప్ర‌శ్నిస్తూ, దుస్తుల ఆధారంగా ఎవ‌రినైనా గుర్తుప‌ట్ట‌డం వీల‌వుతుందా?  అని ఆమె అడిగారు. కేవ‌లం డ్రెస్ కోడ్ ఆధారంగా ఒక‌ర్ని మంచిగా, మ‌రొక‌ర్ని చెడుగా చూడ‌లేమ‌న్నారు. నేను క‌ట్టుకున్న‌ చీరు చూసి, నేను మంచో చెడో అన్న కామెంట్‌ను ఎవ‌రైనా చేయ‌గ‌ల‌రా అని దీదీ ప్ర‌శ్నించారు. ఎవ‌రైనా నెత్తికి టోపీ పెట్టుకుంటే వారిని ఆ టోపీ ద్వారానే గుర్తిస్తారా అని అడిగారు. ఇది వీళ్ల డ్రెస్సు, అది వాళ్ల డ్రెస్సు, ఇది వీళ్ల తిండి, అది వాళ్ల‌ది  ఇది వీళ్లది అనే విషయాలు ఎప్పుడు మ‌న దేశంలోకి చొర‌బ‌డ్డాయ‌ని ఆమె పరోక్షంగా మోదీ ని  నిల‌దీశారు.

పంజాబీలు నెత్తికి త‌ల‌పాగా క‌ట్టుకుంటార‌ని, క్రైస్త‌వ పూజారాలకు ప్ర‌త్యేక డ్రెస్సు కోడ్‌లో ఉంటార‌న్నారు. వారంద‌ర్నీ డ్రెస్సు కోడ్‌, ఆహార అల‌వాట్ల ద్వారా గుర్తుప‌ట్టాలా అని దీదీ ప్ర‌శ్నించారు. మీరు వేసుకున్న శాలువా కూడా కాషాయం రంగులో ఉండాల‌ని ఎవ‌రైనా అడిగినా అడ‌గ‌వ‌చ్చు అని, ఇదేనా మ‌న‌కు కావాల్సింద‌ని ఆమె తెలిపారు. ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రధాని లాంటి వారికీ సరి కాదు అని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: