ఒక కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగి ఉండటం గొప్ప అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో మొత్తం ముగ్గురు రాష్ట్ర సీఎస్ గా పని చేస్తున్నారు. కేష్నీ ఆనంద్ సివిల్స్‌లో ఎంపికై ఐఏఎస్‌గా శిక్షణ పొందుతున్న సమయంలో డిప్యూటీ కమిషనర్ విధుల గురించి నేర్చుకుంటుండగా, ఒక సీనియర్ అధికారి వచ్చి ఎగతాళిగా... "ఈ పని ఎందుకు చేస్తున్నావు? నీకెవరూ డిప్యూటీ కమిషనర్ పోస్ట్ ఇవ్వరులే" అని అన్నారు. అందుకు ఆమె స్పందిస్తూ... "మీరేమీ ఆందోళన చెందకండి. ఏదో ఒక రోజు నేను డిప్యూటీ కమిషనర్ అవుతాను" అని బదులిచ్చారు.

 

కేష్నీ 1983 బ్యాచ్ ఐఏఎస్. హరియాణా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమిషనర్‌గా ఆమె పేరు రికార్డుల్లోకెక్కింది. హరియాణా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత 25 ఏళ్లకు ఒక మహిళ డిప్యూటీ కమిషనర్ అయ్యారు. తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు చేపట్టారు. మరో విశేషం ఏమిటంటే, కేష్నీ కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చీఫ్ సెక్రటరీలు అయ్యారు. ముగ్గురిలో ఈమె అందరికంటే చిన్న. తన అక్కలు meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి ఆనంద్ చౌదరీ (1969 బ్యాచ్), ఊర్వశి గులాటీ (1975 బ్యాచ్) ఇద్దరూ ఈ పోస్టులో పనిచేశారు.

 

"ఆ కాలంలో అన్ని వసతులు సమకూర్చడం అంత సులువైన పనికాదు. మా పెద్ద అక్క పదో తరగతి పూర్తి చేయగానే, ఆమెకు పెళ్లి చేయాలంటూ బంధువులు ఒత్తిడి చేశారు. కానీ, మా అమ్మ ఒప్పుకోలేదు. తను బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చిన తర్వాతే పెళ్లి చేస్తామని తేల్చిచెప్పింది" అని ఆమె తన చిన్ననాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.వీరి కుటుంబ స్వస్థలం పాకిస్తాన్‌లోని రావల్పిండి. 1947 దేశ విభజన సమయంలో ఆ కుటుంబం తమ ఆస్తులన్నింటినీ అక్కడే వదిలేసి భారత్ వచ్చేసింది.

 

లింగ నిష్పత్తిలో అసమానత్వం అనగానే గుర్తొచ్చే రాష్ట్రం హరియాణా అప్పటిలో. అలాంటి రాష్ట్రంలో ముగ్గురు సోదరీమణులు సివిల్స్ సాధించి, ప్రధాన కార్యదర్శి స్థాయికి వెళ్లడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

మరింత సమాచారం తెలుసుకోండి: