తెలుగుదేశం పార్టీ గడచిన పది సంవత్సరాల్లో రోజురోజుకు బలహీనపడుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి నమ్మకస్తులుగా ఉన్న కొంతమంది నాయకులు పార్టీని వీడటమే కాకుండా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును విమర్శిస్తూ బాబుకు చుక్కలు చూపించారు.. పార్టీని వీడిన వారిలో కొడాలి నాని, తమ్మినేని సీతారాం, రోజా, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి ఉన్నారు.
 
వీరిలో కొడాలి నాని, రోజా, తమ్మినేని సీతారాం వైసీపీ పార్టీలో ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ ఎస్ పార్టీలో చేరగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరిన వీరిలో కొడాలి నాని ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉండగా, తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నారు. రోజా ఏపీఐఐసీ ఛైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ ఎస్ లో మంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. 
 
తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన రోజా చంద్రబాబు నాయుడిపై చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు. కొన్ని రోజుల క్రితం రోజా చంద్రబాబు పనికిమాలిన నాయకుడిలా మాట్లాడుతున్నారని, ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గట్టిగా అరిస్తే గడ్డిపరక సింహం కాదని అన్నారు. కొడాలి నాని చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నారని అన్నారు. 
 
చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టాలని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఎన్టీయార్ వెన్నుపోటులో తనకు భాగం ఉందని అందుకే 15 సంవత్సరాలు అధికారానికి దూరమయ్యాయని అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని అన్నారు. చంద్రబాబులా దిగజారుడు రాజకీయాలకు తామెప్పుడూ పాల్పడమని అన్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు నమ్మకస్తులుగా ఉన్న నాయకులే  చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: