టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ప్రజలను  నమ్మిన దాని కంటే తాను చేసిన ప్రచారాన్ని ఎక్కువగా నమ్ముతూ వచ్చాడు. తాను చేసిన ప్రచారం కూడా చంద్రబాబుకు కొన్ని సార్లు కలిసి వచ్చిందనే చెప్పాలి. తనదైన స్టైల్లో ప్రత్యర్థి పార్టీల అసమర్ధతను ఎండగడుతూ మాస్టర్ మైండ్ ప్లాన్లు వేస్తూ ప్రచార రంగంలో దూసుకుపోయే వారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ ఉందా... తనకు  ప్రజలు ఓటు వేయాలనుకుంటున్నారా లేదా అన్నది  మాత్రం చంద్రబాబు పట్టించుకోకపోవటం..   తన చేసే ప్రచారం పై నమ్మకంతో ముందుకు సాగారు బాబోరు . 

 

 

 2009 ఎన్నికలు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రజలను కాదు ప్రచారాన్ని నమ్ముకున్నారు అనడానికి నిదర్శనం. ఎందుకంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా.. టిడిపి ప్రచార రంగంలోకి కొత్త వ్యక్తిని దింపుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. 2009 ఎన్నికల్లో తనకు ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ... ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ టీడీపీకి వాడుకోవాలని భావించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని ప్రచార రంగంలోకి దింపారు. ఎన్టీఆర్ తో ప్రచారం చేయిస్తే భారీగా ఓటు బ్యాంకు పెరిగిపోతుందని భావించారు బాబోరు . 

 

 

 

 కానీ ఎన్నికల్లో గెలవాలంటే నమ్ముకోవాల్సింది  ప్రచారాన్ని  కాదు ప్రజలను  అని బాబోయ్ మాస్టర్ మైండ్ బుర్రకు  ఎందుకు తట్టలేదో  మరి  . ఇక ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసాడు . అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించకుండా జనసేన మద్దతు తీసుకుని ప్రచార రంగంలో దూసుకుపోయారు బాబోరు.. ఎన్నో బూటకపు హామీలను ఇస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఒక రేంజ్ లో నిర్వహించారు. ఎట్టకేలకు ఓసారి ప్రజలు చంద్రబాబును నమ్మి ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు ... కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి  ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఏర్పడేలా చేసుకున్నాడు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో కూడా ప్రజల్లో తనకు ఎలాంటి వ్యతిరేకత ఉంది  అని తెలిశాక కూడా ప్రచారం మీద నమ్మకం పెట్టుకున్నాడు కానీ ప్రజలు ఈ సారి గట్టిగా బుద్ధి చెప్పి కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే టిడిపి పార్టీలు పరిమితం చేశారు. దీంతో ప్రజలను కాకుండా ప్రచారం అమ్ముకోవడం బాబొరి  కొంపముంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: