తెలుగుదేశము ప్రభుత్వము హయాములోరాజధాని అమరావతి  నిర్మాణంలో అన్ని అవకతవక విధానాలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాజధానిపై తీసుకునే పలు కీలక నిర్ణయాలు, ఎటువంటి భూములు అయినా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని హితవు పలికారు. అన్ని ప్రాంతాల ప్రజలకు  సమన్యాయం జరగాలని పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా అమరావతిపై అన్ని ప్రాంతాల్లో చాలామందికి కి అసంతృప్తులు, నిరసనలు ఉన్నాయని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలు అయినా వైఎస్సార్ సీపీ నుంచి కూడా కనీస అభిప్రాయాలు తీసుకోలేదని టీడీపీ పాలనపై పలు విమర్శలు గుప్పించారు అంతా నిరంకుశ పాలన మాదిరి రాజధాని అయిన అమరావతిని నిర్మించడం జరిగినది. ఎన్నో అక్రమ భూములను కాజేయడం కూడా జరిగినది. అన్ని అక్రమ నిర్మాణాలు కూడా నిర్మించడం జరిగినది. 

 

తెలుగుదేశం పార్టీ నాయకుడు   చంద్రబాబునాయుడు ఊహలతోనే దోపిడీకి రంగం సిద్ధమైందని నేను అప్పుడే భావించాను అని అన్నారు. మన ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో దాదాపు. పదేళ్ల వరకు హక్కులున్నా హైదరాబాద్‌ను వదిలేసి వచ్చాం. మన రాజధాని ని మనమే నిర్మించుకుందాం అని కల్లబొల్లి మాటలు చెప్పారు. అమరావతి అనే బూచి ప్రజలకు చూపించారు. మరియు ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు కూడా డా సరియైన న్యాయం కూడా దక్కలేదు.

 

గత ఐదేళ్లలో కేంద్రం 23 విద్యాసంస్థలను ఇచ్చినది. అయినా కూడా శ్రీకాకుళంలో ఒక్కసంస్థ కూడా ఏర్పాటు చేయలేదు.దీనిని బట్టి తనకు కావలసిన జిల్లాల్లో మాత్రమే ఆయన విద్యా సంస్థలకు అనుమతి లభించేలా చేశారు. చంద్రబాబు పార్టీకి మేము అనేకసార్లు అధికారం ఇచ్చిన మా శ్రీకాకుళము జిల్లాకు ఒక్క సంస్థ కూడా ఇవ్వలేకపోయారు. ఆయన ఎంత సేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తాపత్రయ పడ్డారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే బాబు ముందే ప్రణాళికలు వేశారని ముందే చెప్పాను . ఏకంగా లక్షకోట్లు పెడితేకాని చంద్రబాబు అనుకున్న రాజధాని అమరావతి పూర్తవదు. అది సాధ్యంకాదని తెలిసినా ప్రజలనునమ్మించే ప్రయత్నం చేశారు అయితే అమరావతి రాజధాని.లోక కల్యాణం కోసమా? లోకేష్‌ కల్యాణం కోసమా?’అని ధర్మాన అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: