అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని వికేంద్రీకరణ జరగాలని జగన్ అన్నారు. నిపుణుల కమిటీ రాజధానికి వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని జగన్ తెలిపారు. అమరావతిలో లెజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ క్యాపిటల్, వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు. 
 
చంద్రబాబు అమరావతిలో దోపిడీకి పాల్పడ్డారని జగన్ అన్నారు. చంద్రబాబు రాజధాని కోసం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు బినామీల చేత ముందుగానే భూములు కొనుగోలు చేయించారని జగన్ చెప్పారు. 4070 ఎకరాల భూములను చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని జగన్ అన్నారు. 
 
జగన్ మూడు రాజధానుల నిర్ణయం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ది తుగ్లక్ పాలన అని చంద్రబాబు విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతిని జగన్ చంపేయాలని చూస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయటానికి డబ్బులు ఉండాలి కదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. 
 
జగన్ అమరావతిలో ఉంటారా...? విశాఖలో ఉంటారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ దిశగా పయనిస్తోందో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాంతాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ వైజాగ్, కర్నూల్ లో కూడా ఇళ్లు కట్టుకుంటారా...? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఆలోచన వలన ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని చంద్రబాబు అన్నారు. బాబు గారు తన కవి హృదయంతో సీఎం జగన్ ను తుగ్లక్ తో పోల్చటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: