ఆంధ్రుల అభిమాన నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ పెట్టి ఇప్పటికే 35 ఏళ్ళు దాటుతోంది. 1982లో పార్టీ నెలకొల్పిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మూడొంతులు పైగా మెజారిటీ సీట్లు సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా అన్న ఎన్టీఆర్ గారు అధికారం చేపట్టారు. పార్టీని ప్రజల కోసమే పెట్టానని ప్రజా సంక్షేమమే తన ధ్యేమని చెప్పిన అన్నగారు, అప్పటినుండి తాను ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు వీలైనంతవరకు సమర్ధవంతమైన పాలనను అందించారు అనే చెప్పాలి. రూ.2 లకు కిలో బియ్యం, పెళ్లి అయిన మహిళలకు కూడా తమ పుట్టింటి ఆస్తిలో భాగం, 

 

మద్యపాన నిషేధం వంటి గొప్ప గొప్ప పనులు ఎన్నో చేసారు ఎన్టీఆర్. ఆ తరువాత పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు, మెల్లగా పార్టీపై పట్టు సాధించి, కొన్నాళ్ళకు ఎన్టీఆర్ గారిని ప్రక్కకు తప్పించి మెజారిటీ ఎమ్యెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా కూడా ఎన్నిక కావడం కూడ జరిగింది. అనంతరం కొన్నాళ్ళకు ఎన్టీఆర్ గారి మరణం తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, అక్కడినుండి అన్ని తానై ముందుకు నడిపించడం జరిగింది. 30 ఏళ్లకు పైగా పేరున్న పార్టీలో ఇప్పటికీ కూడా కుమ్ములాటలు మరియు అంతర్గత విబేధాలు మాత్రం అలానే ఉన్నాయి. ఇక చంద్రబాబు అధినేతగా అధికారం చేపట్టిన తరువాత, ఎక్కువగా తన అనునాయులకే అవకాశాలు మరియు పదవులు కట్టబెట్టారని కొందరు విమర్శలు చేయడం, 

 

మరోవైపు పార్టీని నెలకొల్పిన నందమూరి ఫ్యామిలీ వారిని పూర్తిగా ప్రక్కన పెట్టడం కూడా బాబు చేసిన తప్పుగా ఇప్పటికీ కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముప్పై ఏళ్ళ పార్టీ అంటే ఎంతో గొప్ప పేరుందని ఊహించుకుని పార్టీలో కొత్తగా చేరే యువ రక్తానికి, చివరికి చేరిన తరువాత కులాల గొడవలు, పంపకాలు వంటివి చూసాక, పార్టీలో ఉండాలనే భావన చాలావరకు పోతోందని అంటున్నవారు కూడా లేకపోలేదు. అందువల్లనే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, కాబట్టి ఇకనైనా చంద్రబాబు పార్టీ ప్రతిష్టను కాపాడేలా, మరిన్ని గట్టి చర్యలు తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: