విశ్వ విఖ్యాత ఎన్టీఆర్ గారు స్థాపించిన టిడిపి పార్టీలో ఒక మాములు కార్యకర్తగా చేరిన చంద్రబాబు, ఆ తరువాహత మెల్లగా మిగతా కార్యకర్తల మరియు నాయకుల మెప్పు మరియు అండదండలతో పార్టీలో తన పేరు పెంచుకుంటూ ముందుకు సాగారు. చివరికి కొన్నాళ్ళకు ఎన్టీఆర్ గారి నుండి పార్టీని లాక్కుని టిడిపిలోని మెజారిటీ ఎమ్యెల్యే ల మద్దతుతో 1989లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఆ తరువాత స్వయంగా ఎన్టీఆర్ గారే చంద్రబాబు పై బహిరంగంగా చేసిన విమర్శల తాలూకు వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ప్రచారం అవుతూనే ఉన్నాయి. 

 

ఇక ఆ తరువాత కొన్నాళ్ళకు ఎన్టీఆర్ హఠాన్మరణంతో పార్టీ అధినేత గా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు 1999 మరియు 2014లో కూడా ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించి మొత్తం మూడు సార్లు ఆంధ్రకు సేవలందించారు. అయితే బాబు ఎక్కువగా మొదటి నుండి తన మద్దతుదారులకు పెద్ద పీట వేసేవారని, అలానే ఆయన పాలనలో తమ కుటుంబం వారికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, నందమూరి హీరోలను తెలివిగా రాజకీయాలకు దూరం చేసారని ఒకింత ఆయనపై నందమూరి ఫ్యాన్స్ లోలోపల గుర్రుగా ఉన్నట్లు ఎప్పటినుండో వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఇక మొదటి నుండి అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించిన బాబు, 

 

మొన్నటి ఎన్నికల సమయానికి కేవలం తన కొడుకు కోసం విపరీతంగా ఖర్చు చేసారని, ఆ సమయంలోనే కొందరు కార్యకర్తలకు ఆయన పై నమ్మకం పోయిందని పలువురు కార్యకర్తలు బహిరంగంగేనే అప్పట్లో చెప్పుకున్నారు. అయితే ఎంత అధినేతగా పాలన సాగించినప్పటికీ, కొంతవరకు నియంతృత్వ పోకడలు ప్రక్కనపెట్టి నందమూరి ఫ్యామిలి వారికి కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించి ఉంటె, మొన్నటి ఎన్నికల్లో పార్టీకి అంత తక్కువ స్థాయిలో సీట్లు వచ్చేవి కాదనే వాదన కూడా ఉంది. మరి మొదటి నుండి అన్నీ తానై పార్టీని నడిపిస్తున్న బాబు, ఇకనైనా తన నాయకత్వంలోని లోపాలను సరిచేసుకుని రాబోయే ఎన్నికల నాటికి పార్టీని ఎంతవరకు పటిష్టం చేస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: