టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికి మూడు సార్లు ఆంధ్రకు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ గత ఎన్నికల్లో పార్టీని మాత్రం కాపాడుకోలేకపోయారు. 2014లో రాష్ట్రానికి మరియు ప్రజలకు ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు ఓటమిని కట్టబెట్టారు. ముఖ్యంగా ఆ సమయంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమలు కావలసిన విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయమై ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీ నమ్మకాన్ని పోగుట్టుకుందని, 

 

అందువల్లనే వాళ్లకు అత్యల్ప సీట్లు మాత్రమే వచ్చాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎక్కువగా ప్రజల సమస్యలు మరియు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదని విమర్శలు కూడా అప్పట్లో కొంతవరకు వచ్చాయి. ఎక్కువగా తమ మద్దతుదారులకు బాబు పనులను అప్పజెప్పడం, అలానే వారిలో కొందరు ఎమ్యెల్యేలు, మంత్రుల పాలన ప్రక్క త్రోవ పడుతున్నప్పటికీ కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం బాబు ప్రభుత్వానికి మొన్నటి ఎన్నికల్లో పెద్ద దెబ్బేసిందని అంటున్నారు. ఇక ప్రజల విషయం కంటే ప్రచార ఆర్భాటాలపై బాబు మరియు టీడీపీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టిందని, 

 

దానితో పాటు ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అధికారం అడ్డుపెట్టుకుని మొన్నటి ఎన్నికల్లో బాబు ప్రభుత్వం నీళ్లు మాదిరిగా ఖర్చు చేసిందనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక దానితో పాటు తన కుమారుడు లోకేష్ విషయమై అర్ధాంతరంగా మంగళగిరిలో అతడికి ఎమ్యెల్యే అభ్యర్థిగా నిలబెట్టి, అక్కడ కూడా ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేసారని అప్పట్లో పలు ఇతర పార్టీలు కూడా విమర్శలు చేసాయి. మరి ఇన్ని విధాలుగా కేవలం ప్రచార ఆర్భాటాల మీదనే దృష్టి పెట్టిన బాబు ప్రభుత్వం, ప్రజల సంక్షేమంపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైందని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: