రాజధాని పేరిట చంద్రబాబు తన హయాంలో ఆడిన డ్రామాలు మొత్తం అసెంబ్లీ సాక్షిగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట పెట్టడం జరిగింది. ఒక ఉద్దేశంతో ఒక సామాజిక వర్గానికి వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు సామాజిక వర్గానికి మేలు చేకూరే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చంద్రబాబు ఆడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారు అన్నట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇవ్వాలా తీవ్రస్థాయిలో బాబుపై ఆయన రాజధాని విషయంలో అనుసరించిన విధానం పై మండిపడటం జరిగింది. ఇటువంటి తరుణంలో అసెంబ్లీ లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

విషయంలోకి వెళితే ప్రస్తుతం బయట ప్రపంచం పరిపాలన విషయంలో పాలకులు మారుతున్నారని సౌత్ ఆఫ్రికా అనే దేశానికి మూడు రాజధానులు ఉన్నాయని మనం కూడా మారాలి అని మన ఆలోచన విధానం కూడా మారాలని జగన్ రాజధాని గురించి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉంది అంటూ వస్తే తప్పు ఏముంది..? విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని మరియు అదే విధంగా రాయలసీమలో అనగా కర్నూలు ప్రాంతంలో జ్యుడీషియల్ రాజధాని ఇదే తరుణంలో అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే విధంగా కామెంట్ చేశారు.

 

వాటి గురించి త్వరలోనే నిపుణుల కమిటీ ఏ విధమైన పరిస్థితి లో రాజధాని ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తారని జగన్ అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గతంలోని నిపుణుల కమిటీ అది సరైన ప్రాంతం కాదని తేల్చి చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రెండు ఆర్గనైజేషనల్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి బాధ్యతలు అప్పజెప్పినట్లు వాళ్ల రిపోర్టు వచ్చాక ఏపీ రాజధాని విషయంలో ముందు అడుగులు వేయబోతున్నటు జగన్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: