చిన్నారుల్లో పోషకవిలువల లోపం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.. ఎదుగుదల లోపం ఇప్పటి పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంది.. రక్త హీనత, ప్రోటీన్స్ లోపం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగడంలేదు... అందుకే ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది..

 

అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలలకు, గర్భిణిలకు, బాలింతలకు మంచి పోషక విలువలున్న ఆహారo అందిస్తున్నారు.. పిల్లలకు ముఖ్యంగా "బాలామృతాన్ని"అందిస్తున్నారు. దీనితో పిల్లలకి సరైన పోషణ అందుతుంది... కాని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెరుగుదలయిన పోషక విలువలున్న ఆహారంని అందచేయాలని "బాలామృతం ప్లస్ "ని ప్రవేశపెట్టారు

 

రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం తార్నాకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ఎన్‌ఐఎన్‌)లో జరిగిన కార్యక్రమంలో ‘బాలామృతం ప్లస్‌’ను వినియోగంలోకి తెచ్చారు..

 


ఈ బాలామృతం ప్లస్ లో పాలపొడి, వేరుశెనగ నూనె, రైస్, గోధుమలు, కందిపప్పు, పంచదార తో పాటు కొవ్వు పదార్దాలు కలిగిన మిశ్రమాన్ని జత చేస్తారు. ఈ బాలామృతం లో పోషకవిలువులతో కూడిన అన్ని రకాలు ఉంటాయి.ప్రస్తుతం బాలామృతం ప్లస్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు జిల్లాల్లో నెలకు సగటున టన్ను బాలామృతం ప్లస్‌ సరఫరా చేసేలా తయారు చేస్తున్నారు. డిమాండ్‌కు తగినట్లు పరిమాణాన్ని పెంచేందుకు టీఎస్‌ఫుడ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లస్‌ ఆహారాన్ని అందిస్తూ చిన్నారుల ఎదుగుదల, పోషక లోపాల తీరును వరుసగా మూడు నెలల పాటు పరిశీలిస్తారు.

 

ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది మరో 10 జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తోంది.
అంగన్వాడీ కేంద్రాల్లో జేరిన పిల్లల ఎదుగుదలపై రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఎప్పటికపుడు జాగ్రత్త వహిస్తుంది.

 

ప్రతినెల పిల్లల ఎదుగుదలని నమోదు చేస్తూ ఉంటారు అంగన్వాడీ కేంద్రాల్లో.. రక్తశాతం, బరువు, ఎత్తు, ఆరోగ్య స్థితిని ఎప్పటికపుడు రికార్డు లో రాసుకుంటారు. దీని భట్టి పిల్లలు ఏదుగుదలలోని లోపాలని గుర్తించి సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందచేస్తారు..

 

ఎక్కువగా తెలంగాణ లో కుమ్రంభీం, ఆసిఫాబాద్, జోగుళాంబ, గద్వాల జిల్లాల్లో ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు అధికారులు అంచనా వేశారు.. అందుకే ఈ పోషక విలువలున్న బాలామృతం ప్లస్ ని అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేయాలనీ అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: