చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో, పార్టీ సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో నోరు తెరిస్తే 40 సంవత్సరాల అనుభవం అని చెబుతూనే ఉంటారు. 40 సంవత్సరాల అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పే చంద్రబాబు అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. 
 
2024 ఎన్నికల నాటికి ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనంగా మారే అవకాశాలు ఉన్నాయి. రోజురోజుకు పార్టీ బలపడటం మాట అటుంచితే ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా కాపాడుకోవటమే చంద్రబాబుకు కష్టమవుతోంది. టీడీపీ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు పార్టీలో యువ నేతలను తయారు చేసుకోవడంలో కూడా విఫలమయ్యారు. 
 
40 ఏళ్ల అనుభవం అని పదేపదే చెప్పుకునే చంద్రబాబు తన అనుభవం అంత వయస్సు ఉన్న జగన్ చేతిలో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఎన్నికల్లో గెలిచిన జగన్ తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్లలో చేసిన అక్రమాలను, అవినీతిని వెలుగులోకి తెస్తోంటే సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు రాజధాని పర్యటనకు వెళితే అక్కడ రైతులు చంద్రబాబుపై రాళ్లతో, చెప్పులతో దాడి చేశారు. 
 
చంద్రబాబు పర్యటనలకు వెళ్లకముందే కొన్ని జిల్లాలలో తీవ్రంగా నిరసనలు వ్యక్తం కావడం గమనార్హం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ఏపీలో తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఏపీలో కూడా తెలుగుదేశం కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై, గడచిన 5 సంవత్సరాల చంద్రబాబు పాలనపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: