ఏ రాష్ట్రానికైనా సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలు రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు సమపాళ్లలో జరిగితే ఆ రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తుంది. అయితే ఇదే బాటలో పయనించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారు. ఆయన ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావొస్తుంది. ఈ ఏడు నెలల కాలంలో ఆయన అభివృద్ధి కంటే సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఈ ఏడు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందించారు. ఇక వీటి వల్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు.

 

అయితే ఈ ఏడు నెలల కాలంలో అభివృద్ధి అనుకున్నంత జరగలేదు. దీంతో ఇప్పటివరకు సంక్షేమ పథకాలతో ప్రజలని మెప్పించిన జగన్... ఇప్పుడు అభివృద్ధితో కూడా సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే అమరావతి నిర్మాణంతో యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఒకచోటే అభివృద్ధి కేంద్రీకరించకుండా 13 జిల్లాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారు.

 

ఇటీవలే కియా పరిశ్రమ ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఆయన...విశాఖ మెట్రోపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. అటు త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అభివృద్ధి మరో అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు నగరాల్లో స్టార్ హోటళ్లను నిర్మించాలని భావిస్తోంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో స్టార్ హోటళ్లను నిర్మించాలని  అనుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 ప్రాజెక్టులకు త్వరలోనే టెండర్లను పిలవబోతున్నారు.

 

విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎనిమిది నగరాల్లో ఇప్పటికే స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం దాదాపు 774 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. ఇక వీటితో పాటు మరికొన్ని చోట్ల స్టార్ హోటల్స్‌ని తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ స్టార్ హోటల్స్ వస్తే...ఆయా చోట్ల వ్యాపారాలు కూడా పెరుగుతాయి. దీంతో ఆటోమేటిక్ గా అభివృద్ధి కూడా జరగనుంది. మొత్తానికి రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి కూడా చేసి...సంక్షేమంతో లెవెల్ చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: