తెలుగుదేశం పార్టీలో ఖాళీగా ఉన్న పదవుల్లో అత్యంత కీలకంగా ఉన్నది తెలుగు యువత అధ్యక్షుడు. యువతని పార్టీ వైపు మరింత ఆకర్షించే ఈ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. మొన్నటివరకు ఈ పదవిలో ఉన్న దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్లడంతో...నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరనే విషయంపై తెలుగు తమ్ముళ్ళలో పెద్ద చర్చే నడుస్తుంది. అయితే దేవినేని అవినాష్ సడన్ షాక్ ఇవ్వడంతో...దీనికి సరైన నాయకుడుని పెట్టడానికి టీడీపీ అధిష్టానం కొంచెం ఎక్కువ శ్రద్ధే పెట్టినట్లు తెలుస్తోంది.

 

తమ లైన్‌లో ఉండి పనిచేసే నాయకుడు కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్నంత కాలం మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఒకానొక సమయంలో లోకేశ్‌ని కూడా డామినేట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ డామినేషన్‌లో అధిష్టానం నుంచి అవినాష్‌కు వార్నింగ్ వస్తే వెనక్కితగ్గి...పార్టీలో ఉంటే ప్రాధాన్యత ఉండదని భావించి అవినాష్ వైసీపీలోకి జంప్ అయ్యారనే ప్రచారం కూడా ఉంది.

 

ఇక అవినాష్‌తో అయిన అనుభవంతో పార్టీ లైన్‌లో అంటే చినబాబు గీసిన గీత దాటకుండా పనిచేసే నాయకుడు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు రేసులోకి చాలా పేర్లు వచ్చిన...ఫైనల్‌గా పరిటాల వారసుడు శ్రీరామ్‌ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. మొన్న ఎన్నికల్లో పరిటాల సునీత త్యాగం చేయడం వల్ల శ్రీరామ్ రాప్తాడు బరిలో దిగారు. అయితే ఓడిపోయాక కొంచెం యాక్టివ్‌గా ఉండటం తగ్గించేశారు.

 

ఈ క్రమంలోనే ధర్మవరంలో వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా పరిటాల ఫ్యామిలీకే అప్పగించారు. ఇక ఇప్పుడు తెలుగు యువత అధ్యక్షుడు పదవి ఇవ్వాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే శ్రీరామ్‌తో కూడా ఇబ్బందులు వస్తాయని భావిస్తే..తెలుగు యువతని చినబాబు వద్దే ఉంచే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌దానంగా లోకేష్ త‌న‌ను పార్టీలో ఎవ‌రైనా దాటి ముందుకు వెళ‌తారన్న డౌట్ వ‌స్తే చాలా ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. అందుకే యువ‌నేత‌ల‌ను కంట్రోల్ చేస్తున్న‌ట్టు టాక్‌..?  మరి చూడాలి తెలుగు యువతకు కొత్త అధ్యక్షుడు వస్తాడో లేక చినబాబుతోనే బండి నడిపించేస్తారో?   

మరింత సమాచారం తెలుసుకోండి: