టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసిన హడావిడి ఎక్కువ...విషయం తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ ఆయన అదే పని చేస్తూ వచ్చారు. ప్రతి విషయంలోనూ గొప్పలు చెప్పుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణంలో ఆయన చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కాదు. రాజధానిని సింగపూర్ చేస్తా, డల్లాస్‌లా నిర్మిస్తా అంటూ డప్పు కొట్టారు. తీరా ఐదేళ్లలో ఏం చేశారంటే ఓ పెద్ద గ్రాఫిక్స్ చేసి ప్రజల చెవిల్లో పువ్వులు పెట్టారు. అయితే ప్రజలు కూడా ఏం తక్కువొళ్ళు కాదు కదా. ఆయన్ని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు.

 

అయితే ఆ ఐదేళ్లు ఆయన చేసిన హంగామా ఇప్పటికీ మారుమ్రోగుతుంది. ఆయన రాజధానిలో ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రతిసారి ప్రజల ముందు పెడుతూనే ఉంది. దాని వల్ల ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారనే నిజనిజాలు ప్రజలకు అర్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే...బాబు వల్ల తెలుగు దిగ్గజ దర్శకులు బోయపాటి శ్రీను, రాజమౌళిలు సైతం విమర్శలు ఎదురుకోవాల్సిన పరిస్తితి వచ్చింది.

 

బాబు అధికారంలో ఉన్నప్పుడూ రాజధాని నిర్మాణంలో డిజైన్లు కోసం రాజమౌళిని లండన్ కూడా పంపారు. ఇక ఇందులో రాజమౌళి కొన్ని డిజైన్లని సూచించారని, కానీ అది బాబు తీసుకోలేదని ప్రచారం జరిగింది. అసలు ఇక్కడ రాజమౌళిని ఇన్‌వాల్వ్ చేయడమే రాంగ్,పైగా ఆయన సూచించిన డిజైన్లు కూడా తీసుకోలేదు. అటు బోయపాటిని ఏ విధంగా వాడారో అందరికీ తెలుసు. గోదావరి పుష్కరాల్లో షూటింగ్ చేసి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారో ఎవరు మరిచిపోలేదు. ఆ తర్వాత కూడా ఆయన్ని పలు కార్యక్రమాల్లో ఉపయోగించుకున్నారు.

 

అయితే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడూ ఈ దర్శకులని వాడుకోవడం వల్ల ఇప్పుడు వైసీపీ నేతలు వారిని విమర్శిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేశారని కామెంట్ చేశారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం సినిమావాళ్లను ఉపయోగించి ప్లాన్ చేయడం అంత్యంత దారుణం అని, అయిన రాజమౌళి, బోయపాటిలు రాజధాని సలహాదారులా అంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి బాబు పుణ్యమంటూ రాజమౌళి, బోయపాటిలు కూడా విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: