ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చంద్రబాబు ఆలోచనలు... ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆయన రాజకీయాన్ని అన్ని రకాలుగా చదివేసి... జగన్ ఏ విధంగా ముందుకి వెళ్ళాలి, వాటిని ఏ విధంగా తిప్పి కొట్టాలి, అవినీతి విషయాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా చంద్రబాబు గురించి చదివేసిన ప్రశాంత్... క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించారు. 

 

వాస్తవానికి బూత్ లెవెల్ తెలుగుదేశం పార్టీకి చాలా బలంగా ఉంటుంది. దానిని టార్గెట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ విధంగా వ్యూహాలు సిద్దం చేసారు. పీకే ప‌న్నిన వ్యూహాల తో వైసీపీ బూత్ లెవ‌ల్ నుంచి ఎలా ప‌డిందో చూశాం. ప్ర‌శాంత్ కిషోర్ టీం ఇందు కోసం ఏపీలో రెండు సంవ‌త్స‌రాల‌కు పైగా వ‌ర్క్ చేసింది. కొన్ని చోట్ల అభ్య‌ర్థుల ఎంపిక లోనూ కీల‌క పాత్ర పోషించింది. 

 

దీనితో జగన్ అధికారంలోకి రావడంలో విజయవంతం అయ్యారు. ఇక ఇప్పుడు... ప్రశాంత్ కిషోర్ ని చంద్రబాబు తన వైపుకి తిప్పుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆయన సుజనా చౌదరి, అరవింద్ కేజ్రివాల్, మమత బెనర్జీ తో మాట్లాడుతున్నట్టు సమాచారం. 2023 లో ఎన్నికలు వస్తే తమకు పని చెయ్యాలని ప్రశాంత్ కిషోర్ ని నియమించుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేసారట చంద్రబాబు...

 

ఎన్నికల కోసం పని చేయడంతో పాటుగా, గ్రౌండ్ లెవెల్ లో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చెయ్యడానికి గాను చంద్రబాబు పసాంత్ కిషోర్ ని సంప్రదిస్తున్నారట. ఇక నాయకుల బలాబలాలు, ఎప్పటికప్పుడు సర్వేలు, ఏ విధంగా జగన్ ని ఎదుర్కోవాలి అనే సూచనలు ప్రశాంత్ నుంచి చంద్రబాబు తీసుకునే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో సుజనా చౌదరి... ప్రశాంత్ కిషోర్ ని కలిసారని సమాచారం. మరి ప్రశాంత్ ఎం అంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: