పౌరసత్వం బిల్లు ఇటీవలే అమలు జరిగింది.  ఈ బిల్లును డిసెంబర్ 9 వ తేదీన లోక్ సభలోను అలానే డిసెంబర్ 11 వ తేదీన రాజ్యసభలోను ఆమోదం తెలిపారు.  అనంతరం డిసెంబర్ 12 వ తేదీన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు.  ఈ బిల్లులో ఒక సవరణ మాత్రమే వేశారు.  అదేమంటే 2011 వరకు 11 ఏళ్లకు ఒకసారి వివిధ దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేవారు.  


కాగా, పౌరసత్వ బిల్లు సవరణతో కొన్ని మార్పులు జరిగాయి.  ఇందులో 11 సంవత్సరాలకు బదులుగా 5 సంవత్సరాలకు తగ్గించి పౌరసత్వం ఇస్తున్నారు.  మొత్తంగా ఇండియాలో 31,313 మంది ఇండియా పౌరసత్వం కోసం వేచి చూస్తున్నారు.  ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలు శరణార్థులుగా ఇండియాకు వస్తే, వారికి ఇండియా ఆశ్రయం ఇవ్వడమే కాకుండా పౌరసత్వం ఇస్తుంది.  

 

ముస్లిం దేశాలలో మైనారిటీలుగా ఉన్న వాళ్లకు మాత్రమే ఈ చట్టం అమలు జరుగుతుంది.  ఇక ముస్లిం దేశాల్లో ముస్లింలు మెజారిటీగానే గుర్తింపు ఉన్నది.  కాబట్టి వాళ్లకు అక్కడ చట్టాలు అన్ని అనుకూలంగానే ఉంటాయి.  కాబట్టి వాళ్లకు ఇండియాలో ఉండాల్సిన అవసరం ఏముంటుంది.  ఉద్యోగం విషయాలోనో వచ్చి వాళ్లకు కంపెనీలు గుర్తింపు ఇస్తే ఇండియాలో వీసాపై ఉండొచ్చు.  వీసా లేకుంటే మాత్రం వారిని తిరిగి పంపించి వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.  


పౌరసత్వం బిల్లు ఆమోదం తరువాత ఈ చట్టాన్ని మొదట కర్ణాటకలో అమలు చేయడానికి కేంద్రం సిద్ధం అయింది.  కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నది.  కర్ణాటక రాష్ట్రంలో ఈ పౌరసత్వం బిల్లును అమలు చేస్తే... అక్కడ ఎంతమంది విదేశీ ముస్లింలు ఉన్నారు అనే విషయం చూసి దానిని బట్టి వారిని వారి దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.  కర్ణాటకలో అమలు చేసిన తరువాత దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ బిల్లును అమలు చేయబోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: