పార్లమెంట్‌లో ఆమోదం ఎలా పొందింది అన్న విషయానికి వస్తే.. తాజాగా డిసెంబర్ 9న లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు  ఆమోదం లభించగా..డిసెంబర్  11న రాజ్యసభలో ఆమోదం లభించడం జరిగింది. ఆ తర్వాతి రోజు రాష్ట్రపతి సంతకం చేయడంతో సవరణ బిల్లు చట్టంగా మారడం జరిగింది. వాస్తవానికి  ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అని సుప్రీంలో సవాల్ ఖచ్చింతంగా చేస్తాము అని అంటున్నారు.

 

ఈ నూతన చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపేలా ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశ జనాభాలో 15 శాతం మంది ముస్లింలు ఉన్నారు అని తెలుస్తుంది. ఇక పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్ దేశాలు.. అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. వారిని హింసకు గురవుతున్న మైనార్టీలుగా గ్రహించలేము అని కేంద్రం తెలియచేస్తుంది.

 

నిజానికి ఈశాన్య రాష్ట్రాలపై  పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం చాల ఎక్కువగా ఉంటుందని కేంద్రం భావిస్తుంది. ఇక   భారత్‌లో ఎంతమంది అక్రమంగా ఉంటున్నారు సరైన గణాంకాలు అసలు చూపలేక పోతున్నారు   అని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంటెలిజెన్సీ బ్యూరో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తెలిపిన ప్రకారం.. మైనార్టీలైన 31,313 మంది దీర్ఘాకాలిక వీసా మీద భారత్‌లో నివాసం ఉంటున్నారు అని తెలిపింది. వీరంతా భారత పౌరసత్వం కోరడం జరుగుతుంది అని తెలిపారు.

 

Image result for పౌరసత్వ సవరణ చట్టం


పౌరసత్వ సవరణ చట్టం ద్వారా హిందువులైనా, ముస్లింలైనా.. భారతీయులపై ఎలాంటి ప్రభావ చూపడు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏ విషయం లేకున్నా కూడా చాలా  రాద్ధాంతం చేస్తున్నాయి అని అమిత్ షా అన్నారు. అసోంలో తలపెట్టిన మాదిరిగానే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఈ చట్టం ఎన్ఆర్సీకి మతానికి ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: