గత కొన్ని నెలలక్రితమే జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు వాయిదాలు పడుతూ కొందరు కోర్టు కెళ్ళి పలు సంచలన నిర్ణయాల తరువాత తాజాగా ఉన్నత న్యాయస్థానం మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది.  సాధారణంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ   ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడం కంటే క్రింది స్థాయి ఎన్నికల సభ్యులను ప్రకటించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది.

దీనిలో భాగంగానే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను  అందించాలని  అర్హులైన అభ్యర్థులను ప్రతిపాదించే  అవకాశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను కోరింది. ప్రతి నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలను అక్కడి ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు. అయితే అసలు పంచాయితీ ఇక్కడే మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని స్థానాలలో తెరాస అభ్యర్థులే ఉండడం అలాగే కొన్ని నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరగా కొందరు ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి టిఆర్ఎస్ టిక్కెట్ మీద గెలిచారు. దీంతో అక్కడ పార్టీలోని పెద్దల మధ్య పంచాయతీ ఏర్పడుతుంది.

మాజీ ఎమ్మెల్యే వర్సెస్ తాజా ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ మొదట్నుంచీ నడుస్తూనే ఉంది దానికి తోడు  ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు నడుస్తున్న నేపధ్యంలో టిక్కెట్ల విషయంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలకు పడటం లేదు. మావాడికి అవకాశమివ్వాలి అంటే మా వాడికి ఇవ్వాలనీ పోటా పోటీగా అభ్యర్ధులు తెరమీదకు తీసుకొస్తున్నారు.

 ఉదాహరణ కు ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే జూపల్లి  కి మరియు వారి వర్గానికి  మరియు ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డిల మధ్య గొడవ జరిగాయి. ఆ పంచాయతీ అలాగే ఉండగానే ఇప్పుడు మున్సిపల్  ఎన్నికలు వచ్చాయి. పార్టీ  బి ఫారం ఈ ఇద్దరు నేతలు తమ అనుచరులను తెరమీదకు తీసుకొస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానానికి  వీరిద్దరికి  ఎలా సర్దిచెప్పాలని ఇబ్బందిగా మారింది.  అదే విదంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులను చూస్తే  మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు మింగుడు పడటంలేదు, ఇదే విషయాన్ని జిల్లా పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.  ఇలా దాదాపు వేరే పార్టీ ఎమ్మెల్యేలున్న ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలే ఎదురు కావడంతో ముందస్తు చర్యలు ప్రారంభించారు సీఎం కెసిఆర్.   కొత్త ,పాత పంచాయతీ లేకుండా చూసి ఎన్నికల సాఫీగా జరిగేలా చూడాలని మంత్రులు ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనికి గాను కెటిఆర్ ను హరీష్ రావు ని రంగం లోకి దించాలను చూస్తున్నట్లు అంచనా చూడాలి ఎం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: