పై ఫొటోలో గోనెసంచి నడుముకి కట్టుకొని, బూట్లతో చెంపలు వాయించుకుంటున్న వ్యక్తి పేరు రాజమాణిక్యం. ఆయన ఊరు చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె. పట్నం గ్రామం. ఇతను దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఎంత గొప్ప వీరాభిమానంటే.. వైఎస్ చనిపోయిన అనంతరం తన సొంత ఇంటిని అమ్మి ఆయన గ్రామంలో(కె.పట్నం) వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కట్టించాడు.


పుట్టుకతోనే దివ్యాంగుడైన వైఎస్ వీరాభిమాని రాజమాణిక్యం... జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతో ఆకాంక్షించారు. మహానేతపై అభిమానంతో జగన్ సీఎంగా రావాలని దేవుడికి మొక్కు మొక్కి గతంలో 6 ఏళ్లగా గడ్డం, జుత్తుతో ఉన్నాడు. జగన్ 6 నెలలు క్రితం సీఎం కావడంతో, గడ్డం తీసి దేవుని మొక్కుని తీర్చుకున్నాడు.


ఇదంతా బానే ఉంది కానీ, సోమవారం రోజు మాత్రం అతడు వైసీపీ పార్టీని తీవ్రంగా విమర్శించాడు. వైసీపీకి ఎందుకు ఓటేసానురా నాయనా అంటూ బూట్లతో తన చెంపలు వాయించుకోవడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే... అతడు వికలాంగుల పింఛనుకు, తెల్ల రేషన్‌కార్డుకు అర్హుడినైనా... ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పింఛను కానీ, కార్డు కానీ రాలేదు. మొన్న స్పందన కార్యక్రమం జరుగుతుంటే... అక్కడి వెళ్లి తన గోడును చెప్పుకొన్నాడు. కానీ స్థానిక మండల వైసీపీ కన్వీనర్‌ ప్రతాప్‌రెడ్డి చెప్తేకాని పింఛను ఇచ్చేదిలేదని తహసీల్దార్‌ చెప్పారు. దీంతో దళితుడినైన తనను అధికారులు ఖాతరు చేయట్లేదని... వైసీపీ పై ఎంత అభిమానం ఉన్నా.. అతనికి న్యాయం జరగలేదని కంటతడి పెట్టాడు. ఆ తరువాత తిరుగు మొహం పట్టి నడిరోడ్డుపై బూట్లతో కొట్టుకుంటూ తన ఆవేదనను వ్యక్తం చేసాడు. అయితే రాజమాణిక్యం ఫొటో సోషల్ మీడియా లో తెగ వైరల్ కావడంతో... జిల్లా మంత్రి ఆయన విషయంపై ఆరాతీసినట్లు సమాచారం. రాజమాణిక్యం కు ఎంత త్వరితంగా న్యాయం జరుగుతుందో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: