ఉత్తరాంధ్ర, రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రజలను నొప్పించకుండా రాజధాని విషయంలో జగన్ తెలివిగా వ్యవహరించారా?, ఏపీకి మూడు రాజధానులు అవసరమా?. ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే చంద్రబాబు గారి అమరావతి కథని ఒక్కసారి చదవాలి.  విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, ఏపీని ఆర్ధికంగా గాడిలో పెట్టి మళ్ళీ అభివృద్ధి పట్టాలు ఎక్కించాలంటే చంద్రబాబు అనుభవం ఉపయోగపడుతుందని ప్రజలు చంద్రబాబును సీఎం చేశారు. 

 

టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బాబు రాజధాని నిర్మాణం మీద దృష్టిపెట్టారు. సింగపూర్ తరహాలో రాజధానిని నిర్మిస్తానని బీరాలు పోయారు. నిజానికి రాజధాని నగర నిర్మాణం వేరు ఆర్ధిక వ్యవస్థ నిర్మాణం వేరు ఈ రెండు ఒక్కటే అంటూ బాబు భ్రమించి లాజిక్ మిస్ అయ్యారు. రాజధాని నిర్మాణం అంటూ డబ్బును వృధాగా ఖర్చు చేశారు. హైదరాబాద్ తరహా ఆర్ధికంగా వ్యవస్థ అమరావతి సాధించాలంటే మరో 50 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనో, చంద్రబాబు హయాంలోనో హైదరాబాద్ ఆర్ధిక వ్యవస్థ బలపడలేదు. హైదరాబాద్ ఆర్ధిక వ్యవస్థకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది ఇంతటి బలమైన ఆర్ధిక వ్యవస్థ నిర్మించాలంటే చాలా సంవత్సరాలు సమయం అవసరం అన్నది సుస్పష్టం. 

 

రాజధాని నగర నిర్మాణం, ఆర్ధిక వ్యవస్థ నిర్మాణం ఒక్కటేనంటూ లాజిక్ మిస్సైన బాబు, ఇప్పుడు జగన్ మూడు రాజధానుల ప్రకటనపై ఆలోచనలో పడ్డారు. ఏపీలో ఎలాగో డబ్బు లేదు అనవసరమైన ఆర్భాటాలకు పోయి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకుండా ఉన్న నగరాల్లోనే అభివృద్ధిని వికేంద్రీకరించుకుంటూ వెళ్తే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడే అవకాశం ఉంది సరిగ్గా ఇదే ఆలోచనతో మూడు రాజధానుల ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారు జగన్. విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్ ఆర్ధికంగా బాగా నిలదొక్కుకున్న నగరాలు కావడంతో రాజధాని ఏర్పాటుకు పెద్దగా ఖర్చు ఉండదు. అలాగే ఈ మూడు ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే ఏపీ సంపూర్ణ అభివృద్ధికి అవకాశం ఉంటుంది అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మూడు ప్రాంతాల్లో rరాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని విషయంలో ఏ ప్రాంతాన్ని నొప్పించకుండా ఉండొచ్చు అని జగన్ భావించినట్టున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: