అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించిన సంగతి తెలిసిందే. ఆయన, ఆయన అనుచరులు దాదాపు 4 వేల ఎకరాలు హస్త గతం చేసుకున్నారట. ఈ విషయం సాక్షాత్తు సీఎం జగన్ అసెంబ్లీ లో వెల్లడించారు.

 

 

 

సీఎం జగన్ అసెంబ్లీలో ఏమన్నారంటే.."

ఇప్ప‌టివ‌ర‌కు 4070 ఎక‌రాలు చంద్ర‌బాబు త‌న బినామీల‌కు కేటాయించిన‌ట్లు గుర్తించ‌డం జ‌రిగింది.  రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చిన్నాభిన్నం చేశాడు. ల‌క్ష‌ప‌దివేల కోట్ల‌కు రాజ‌ధాని ప్లాన్ రూపొందించి 50వేలకు కోట్ల‌కు టెండ‌ర్లు పిలిచాడు. కేవ‌లం 5,800 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశాడు. అది కూడా బ్యాంకుల ద‌గ్గ‌ర్నుంచి ఇత‌ర బాండ్ల ద్వారా 10.31 శాతానికి వ‌డ్డీకి తెచ్చి అప్పుల్లో ముంచేశాడు.

 

 

 

 చంద్ర‌బాబు మాదిరిగానే నాకూ అత్య‌ద్భుత రాజ‌ధానిని నిర్మించాల‌నే ఉంది. కానీ మ‌న వ‌ద్ద ఉన్న ఆస్తులెంత‌, అప్పులెన్ని, అవ‌స‌రాలు, అత్య‌వ‌స‌రాలు ఏమిట‌ని ఆలోచించుకుని ఒక ప్ర‌ణాళిక రూపొందించుకున్నాం. పోల‌వ‌రం నుంచి బోల్లేప‌ల్లిలో ఒక రిజ‌ర్వాయ‌ర్ క‌ట్టి దారి మ‌ధ్య‌లో పులిచింత‌ల నింప‌డం క‌రువు సీమ రాయ‌లసీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయ‌డానికి బ‌న‌క‌చ‌ర్ల‌కు నీరు క‌ల‌ప‌డం మా ముందున్న ల‌క్ష్యం. దీనికి దాదాపు 60 వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేశాం. ఎంత‌టి భారీ వ‌ర్షాలు కురిసినా ప్రాజెక్టులు నింప‌లేక‌పోయాం. కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచాల్సి ఉంది. ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీల‌కు మ‌రో 23 వేల  కోట్లు అవ‌స‌రం. దీంతోపాటు ఉత్త‌రాంధ్ర‌ను బాగు చేయాలి.

 

 

 

 పోల‌వ‌రం నుంచి ఎడ‌మ కాలువ ద్వారా ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. దీనికి క‌నీసం 16 వేల కోట్లు కావాల్సి ఉంది. తూగోప‌గో జిల్లాల్లో ఆక్వా ద్వారా తాగునీరు క‌లుషితం అయ్యింది. బోర్లు వేస్తే ఉప్పునీరు వ‌స్తుంది. ధ‌వ‌ళేశ్వ‌రం లేదా పోల‌వ‌రం వ‌ద్ద వాట‌ర్ గ్రిడ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు జిల్లాల‌కు వాట‌ర్ గ్రిడ్ ద్వారా పైపులైన్ల‌తో తాగునీరు అందించేందుకు సుమారు 8 కోట్ల మేర ఖ‌ర్చ‌వుతుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా తాగునీటికి ఖ‌ర్చు చేయాలంటే కనీసం 40 వేల కోట్లు ఖర్చవుతుంది. బడులు చూస్తే శిథిలావస్థ‌లో ఉన్నాయి. ఆస్ప‌త్రులు చూస్తే లైట్లు లేవు. ఎలుక‌లు కొరికి పిల్ల‌లు చ‌నిపోయిన దుస్థితి. ఆస్ప‌త్రి, స్కూళ్ల‌ను బాగు చేయాలంటే మ‌రో 30 వేల కోట్లు ఖర్చ‌వుతున్నాయి. వీటితోప‌టు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు డ‌బ్బు కావాలి. ఇలాంటి ప‌రిస్థితులో రాజ‌ధానిలో 53 వేల ఎక‌రాలు డెవ‌లప్ చేసేదానికి వ‌డ్డీలేకుండా చూసుకున్నా క‌నీసం ల‌క్ష కోట్లు కావాలి.

 

 

 

 ఇలాంటి స‌మ‌యం లో మ‌నం ఆర్థిక ప‌రిస్థితులు బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలి. చంద్ర‌బాబు తెచ్చిన 5800 కోట్ల అప్పుల‌కు ఇప్ప‌టికీ  ఏటా 700 కోట్లు వడ్డీలు క‌డుతున్నాం. అందుకే ఇప్ప‌టికైనా మంచి నిర్ణ‌యం తీసుకోవాలి. సౌతాఫ్రికా మాదిరిగా మ‌న‌కూ మూడు రాజ‌ధానులు ఉంటే మంచిద‌నిపిస్తుంది. హైకోర్టు క‌ర్నాలులో ఏర్పాటు చేసుకుని జ్యుడీషియ‌రీ క్యాపిట‌ల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ గా విశాఖ‌, లెజిస్లేటివ్ క్యాపిట‌ల్ గా అమ‌రావ‌తిని ఏపీకి మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 

 

 

విశాఖ‌కు మెట్రో రైలు తీసుకొచ్చి త‌క్కువ ఖ‌ర్చుతోనే అభివృద్ధి తీసుకొచ్చేలా క‌మిటీని వేశాం. దీనిపై రెండు కంపెనీలు స్ట‌డీ చేస్తున్నాయి. వారిచ్చిన రిపోర్టుల ఆధారంగా మంచి నిర్ణ‌యం తీసుకుని భ‌విష్యత్ త‌రాలకు మేలు చేయాల‌ని ఆలోచ‌న చేస్తున్నాం.. అని వివరించారు సీఎం జగన్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: