దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరువాత నగరంలో మహిళలపై వేధింపులు, అత్యాచారాలు తగ్గుతాయని అనుకున్నారు.  కానీ, ఈ కేసులు తగ్గకపోగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  చిన్నా పెద్ద అనే తేడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  దిశ అత్యాచారం తరువాత ఓ మతిస్థితిమితం లేని ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ ముగ్గురిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు.  

 


ఈ సంఘటన మరువకముందే పాతబస్తీ లోని బండ్లగూడ ప్రాంతంలో మరోఘోరం జరిగింది.  ఈనెల 13 వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బండ్లగూడలో నివసించే ఓ వ్యక్తి మైలార్ దేవులపల్లి ప్రాంతంలోని ఓ రంగుల కంపెనీలో పనిచేస్తుంటాడు.  ఈనెల 13 వ తేదీన తన 11 ఏళ్ల కూతురుని తీసుకొని తన పరిశ్రమకు వెళ్ళాడు.  


తండ్రి తన పనుల్లో ఉండగా చిన్నారు అక్కడి తిరుగుతూ ఆడుకుంటోంది.  అయితే, ముగ్గురు దుండగులు ఆ చిన్నారిని బెదిరింది గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారట.  అయితే, చిన్నారు గత మూడు రోజులుగా అదోలా ఉంటుండటంతో గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.  వెంటనే చిన్నారిని తీసుకొని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు.  


చాంద్రాయణగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.  వెంటనే స్పందించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  దిశ కేసు తరువాత పోలీసులు ఎక్కడి నుంచి కంప్లైన్ట్ చేసినా తీసుకుంటున్నారు.  సదరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తూ నేరస్తులను  సహకరిస్తున్నారు. దిశ కేసు తరువాత చాలా మార్పులు వచ్చాయని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: