దిశ నిందితుల కేసులో కొన్ని భయంకరమైన  కొత్త  విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిశ ఉదంతానికి ముందు మరో తొమ్మిది హత్యలు చేసినట్లు నిందితులు పై అనుమానాలు వ్యకతమవుతున్నాయి. ఈ హత్యలన్ని

హైవేల పక్కనే జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

 

 

 

అందుకే నిందితుల డిఎన్ఏ తో మిస్టరీ చేదించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం తొమ్మిది హత్యలు చేసినట్లు వాగ్మూలం లో పేర్కొన్నట్లు సమాచారం వస్తోంది. దిశ మాదిరిగానే మరో తొమ్మిది హత్యలు చేసినట్లు స్పష్టీకరణ అవుతోంది. ప్రధాన నిందితుడు ఆరీఫ్ అలి ఆరు హత్యలు, చెన్నకేశవులు మూడు హత్యలు చేసినట్లు వాగ్మూలం చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది.

 

 

మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, కర్ణాటక, హైదరాబాద్ హైవేల పైనే ఈ దారుణాలు చేశారు.

అన్నిటిలో లైంగికదాడి ఆపై హత్య చేసి పరారీ కావడం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

అన్నిటిలోనూ మృతదేహాలను కాల్చేడయం వీరి నేర ప్రక్రియ అని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికి 15 మంది మహిళలు హైవేలకు ఆనుకుని హత్య లు జరిగాయి.

 

 

ఆ 15 మర్డర్ కేసుల్లో డిఎన్ఏ రిపోర్టులను పరిశీలిస్తున్న పోలీసులు.. ఆధారాల కోసం వెతుకుతున్నారు.దిశ కేసులో కేస్ డైరీ  వేసే సమయానికి ఈ కేసులని చేధించాలనుకుంటున్న పోలీసులు తెలిపారు. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్, ల డిఎన్ఏ లతో మరిన్ని హత్య కేసుల్లో మ్యాచ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

 

దిశను గత నెలలో శంషాబాద్ వద్ద భయంకర మైన అత్యాచారం, హత్య చేసిన సంగతి తెలసిందే. ఈ ఘటన మొత్తం దేశాన్ని కదిలించింది. దీని పై పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. ఆ తరవాత దిశ కేస్ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అయితే ఈ ఎన్కౌంటర్ పై కోర్టులు విచారణకు ఆదేశించిన విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: