ఆంధ్ర ప్రేదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా తప్పు దోవ పట్టించేయాలనే ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుతంత్రాలు పన్నుతున్నారుగా. ఈ విషయంలో ఆయన ఎంతకైనా దిగజారేందుకు కూడా వెనుకాడటం లడనట్టుగా కన్పిస్తుంది. ఇందుకు ఎల్లో మీడియా కూడా జత కట్టడం దుర్గమైన చర్య అని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. రాజధాని ప్రాంతం ఎంపికపై గతంలో ప్రతిపక్షనేతగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  సూచనను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు 2014 సెప్టెంబరు 4న అసెంబ్లీ సాక్షిగా జగన్‌ చెప్పారన్నారు. రాజధానికి 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని సభలో ఆయన సూచించారన్నారు.

‘‘రాజధాని ప్రాంతంలో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినా 2004లో ఖైరతాబాద్‌ స్థానంలోనూ ఓటమి పాలయ్యాం. ఓటమికి భయపడే వ్యక్తిని కాను. అన్ని జిల్లాలకూ అనుకూలమైన ప్రాంతం కాబట్టే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశాం అని తెలిపారు. రాజధాని అమరావతి ఏ ఒక్క వర్గానిదో కాదని, రాజధాని అంశంలో కులాల ప్రస్తావన దారుణమని మాజీ చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్‌ ‘మూడు రాజధానుల’ ప్రకటన చేయకముందు... అసెంబ్లీలో చంద్రబాబు ఈ అంశంపై జరిగిన చర్చలో మాట్లాడారు.

‘‘రాజధానిపై శివరామకృష్ణ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తే అత్యధికులు విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని సూచించారు. రాజధాని అంటే నాలుగు భవనాలు కాదని, భవిష్యత్తు తరాల ఉపాధికీ బాసటగా ఉండాలనే లక్ష్యంతోనే అమరావతి నిర్మాణం చేపట్టాం. 13 జిల్లాల అభివృద్ధికి రాజధానే ఆదాయ వనరు. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి’’ అని తెలిపారు. అమరావతిలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా భూమిని కొనుగోలు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారు. స్విస్‌ చాలెంజ్‌కి, జీటూ జీకి తేడా తెలియని మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. రస్‌ ఆల్‌ఖైమా గవర్నమెంట్‌ ఒప్పందం పేరుతో దోపిడీ చేశారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: