ఒక రాష్ట్రానికి ఒక రాజధాని.. సాధారణంగా అనుకునే విషయం. కానీ ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు. ఇదీ దేశానికి కొత్త కాదు. దేశంలో పది రాష్ట్రాల రాజధానుల వికేంద్రీకరణ  ఇప్పటికే జరిగింది. ఏపీకి కూడా ఇదే తరహాలో ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్, లెజిస్లేటివ్ కేపిటల్స్ రానున్నాయా? 

 

అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చెప్పిన సౌతాఫ్రికా మోడల్ ఏమిటనే ఆసక్తి అందరిలో వ్యక్తమవుతోంది.  అసలు సౌతాఫ్రికాలో రాజధానులు ఎలా ఉన్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సౌతాఫ్రికా మోడల్ అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడీషయల్ కేపిటల్స్ వేర్వేరుగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రిటోరియా ఉంటే... బ్లూమ్ ఫాంటెన్ ప్రాంతంలో జ్యుడీషియల్ రాజధాని ఉంది. లెజిస్లేటివ్ రాజధానిగా కేప్ టౌన్ ఉంది. ఇదే తరహాలో ఏపీలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరముందంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సౌతాఫ్రికా మోడల్ ఏపీకి సరిగ్గా సరిపోతుందని సీఎం అంటున్నారు.


 
సౌతాఫ్రికా తరహాలో, విశాఖను ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, చట్టసభల రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే హైకోర్టు పెట్టడం ద్వారా జ్యుడీషియల్ కేపిటల్గా కర్నూలు మారొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు  సీఎం జగన్. నిజానికి సౌతాఫ్రికాలోనే కాదు.. మనదేశంలో్ దేశంలో పలు రాష్ట్రాల్లో వికేంద్రీకరణ నడుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాజధానులు విభజించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకచోట, జ్యుడీషియల్ క్యాపిటల్ మరో చోట, లెజిస్లేటివ్ క్యాపిటల్ మరో చోట ఏర్పాటు చేశారు. ఉదాహరణకు చత్తీస్‌ గఢ్ అసెంబ్లీ  రాయపూర్ లో ఉంటే, హైకోర్టు  బిలాస్పూర్ లో ఉంది. 


గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ, పరిపాలన విభాగం - గాంధీనగర్ లో ఉంటే, హైకోర్టు అహ్మదాబాద్ లో ఉంది. కేరళ సెక్రటేరియట్, అసెంబ్లీ తిరువనంతపురంలో ఉంటే, హైకోర్టు కొచ్చిలో ఉంది. మధ్యప్రదేశ్   అసెంబ్లీ, సెక్రటేరియట్-భోపాల్ లో ఉంటే,  హైకోర్టు జబల్పూర్ లో ఉంది. మహారాష్ట్ర కు సమ్మర్ క్యాపిటల్ గా ముంబై, వింటర్ క్యాపిటల్ గా నాగ్పూర్ ఉంది. ఒడిశాలో  పరిపాలన విభాగం అంతా భువనేశ్వర్ లో ఉంటే, హైకోర్టు కటక్ లో ఉంది. రాజస్థాన్ లో పారిపాలన విభాగం  జైపూర్ లో ఉంటే, హైకోర్టు  జోద్ పూర్ లో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో పారిపాలన విభాగంచ, అసెంబ్లీ-లక్నోలో ఉంటే, హైకోర్టు-అలహాబాద్ లో ఉంది. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ, సెక్రటేరియట్  డెహ్రాడూన్ లో ఉంటే,  హైకోర్టుని నైనిటాల్ లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు సీఎం జగన్. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని.. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. కర్నూలులో జుడీషియల్ క్యాపిటల్ రావొచ్చని అన్నారు. దీంతో మూడు రాజధానులపై పెద్ద  ఎత్తున చర్చ నడుస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: