పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అతడి ప్రయత్నం  ఫలించలేదు కేవలం ఒకే ఒక్క సీటు ను దక్కించుకుంది చివరకు పవన్ ని కూడా ప్రజలు తిరస్కరించారు. ఒక్కగానొక్క ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పోటీ చేసి గెలుపొందారు ఈయన. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అల్లూరి క్రిష్ణంరాజు జనసేనలో ఉండి అతడి  సహాయ  సహకారంతో గెలిచారు ఈయన.

అయితే జనసేన పార్టీ ఓటమి తరువాత అల్లూరి క్రిష్ణంరాజు జనసేన  పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయారు. అప్పటి నుంచి రాపాక వరప్రసాద్ కూడా  జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోతారన్న ప్రచారం జోరుగానే సాగింది. కానీ రాపాక మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తూ వచ్చారు అయితే తాను చివరి వరకు జనసేన పార్టీలోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ చాలా సంతోషించారు. ఇదంతా జరుగుతుండగా రాపాక వరప్రసాద్ పైన స్థానిక వైసీపీ నేతలు మరియు ఆయన అనుచరులు ఒత్తిడి పెంచడం ప్రారంభించారు.

అలాగే వారు అతడికి నచ్చజెప్పే ప్రయత్నంలో  భాగంగా జనసేన పార్టీలో ఉంటే ఒరిగేది ఏమీ ఉండదని ఆ పార్టీని ఎంత త్వరగా వీడితే అంత మంచిదని మార్చే ప్రియత్నం చేస్తున్నారు. దీంతో రాపాక వరప్రసాద్ మారిపోయినట్లు అనిపిస్తుంది. ఇటివల  పార్టీ అధినేతపైనా తీవ్రస్థాయిలో విమర్శలు  చేయడం అది కూడా గత 15 రోజులు నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మరియు  ఏకంగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం కూడా మానేయడం చూస్తే  రాపాక వరప్రసాద్ మారిపోయారని అనిపించకమానదు. గత కొన్నిరోజుల క్రితం జరిగిన రైతు సౌభాగ్యదీక్షకు రాపాక హాజరుకాలేదు. దీనిపై  పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయినట్లు సమాచారం.

పార్టీలోని సీనియర్ నేతలందరితోను పవనే   అయన గురించి స్వయంగా  మాట్లాడారట. అతడి వాలకం చూస్తుంటే అలాగే  రాపాక పార్టీని వదిలివెళ్ళి వైసిపిలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది ఆ విషయం మనకందరికీ తెలుసు. అయితే అయన ఏ సమయంలోనైనా  వైసీపీ లోకి జంప్ అయ్యేలాగా అనిపిస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు మరి  అయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.అలాగే పార్టీ అధినేతను విమర్శిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తారని, అప్పుడు రాజీనామా చేయకుండా వైసిపిలో చేరిపోవచ్చని రాపాక వరప్రసాద్ భావిస్తున్నారట. చూడాలిఏంజరుగుతుందో.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: