అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఉన్న చరిత్ర గురించి తెలియని వారుండరు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తమకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న వీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసిపి చేతిలో చావు దెబ్బ తిన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు మరియు తన కొడుకు పరిటాల శ్రీరామ్ కు రాప్తాడు మరియు ధర్మవరం సీట్లు ఇవ్వాలని పరిటాల సునీత చంద్రబాబును కోరగా బాబు రకరకాల కారణాలు చెప్పి కేవలం రాప్తాడుని మాత్రమే వారికి ఇచ్చి ఎవరు పోటీ చేయాలన్న విషయాన్ని కూడా వారికే వదిలేశాడు. దీంతో కొడుకు కోసం సునీత పోటీ చేయకపోగా శ్రీరామ్ కూడా వైసిపి సునామీలో కొట్టుకుపోయాడు.

 

అయితే ఈ మధ్య కాలంగా వీరు టీడీపీని వదిలి వెళ్లిపోతున్నట్లు మరియు ఒక దశలో బిజెపిలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీని పై మౌనం వహించిన పరిటాల ఫ్యామిలీ తీరు చూసి ఆ ప్రచారం కాస్తా ఊపందుకొని చంద్రబాబు దాకా వెళ్ళింది. దీంతో బాబు పరిటాల సునీత మరియు శ్రీరామ్ లను అమరావతికి పిలిపించుకున్నాడు. ఈ సందర్భంగా తాము పార్టీని వదిలిపోతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పరిటాల ఫ్యామిలీ చంద్రబాబుకు క్లారిటీ ఇవ్వగా బాబు కూడా పరిటాల ఫ్యామిలీకి పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కోసం ఓ యువజన నేతల కోటరీని చంద్రబాబు సిద్దం చేశారన్న ప్రచారం జరిగింది. ఈ యువ కోటరీలో చింతకాయల అయ్యన్న పాత్రుని తనయుడు విజయ్, పరిటాల సునీత తనయుడు శ్రీరామ్, ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తదితరులున్నారంటూ పెద్ద ఎత్తున కథనాలొచ్చాయి. తాజాగా వీరిద్దరు పార్టీని వీడకుండా వుండేందుకు పరిటాల శ్రీరామ్‌కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వనున్నాడట. ఇంతే కాకుండా ఎన్నికల్లో రాప్తాడు తో పాటు ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్ను కూడా పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: