తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అనంతపురం సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా ప్రస్తుత రాజకీయాల గురించి మరియు అదే విధంగా గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పరిపాలన గురించి అనేక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాజకీయాలలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా అలాగే ప్రజల కోసం పని చేసే భాగ్యం నాకు దక్కింది అదొక సంచలన రికార్డ్ అంటూ నా రికార్డు బ్రేక్ చేయడం ఎవరి తరం కాదు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం ప్రపంచం అంతా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయాలలో తిరగటం జరిగిందని అప్పుడు కష్టపడటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధిపథంలో నడుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఇదే తరుణంలో అసెంబ్లీలో రాజధాని భూముల విషయంలో అధికార పార్టీ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు. పయ్యావుల రాజధానిలో భూమి కొన్నాడని తప్పుడు ప్రచారం చేశారు. ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే ఒక్కో ఉన్మాదిలా తయారయ్యారని ఆయన ఆరోపించారు. రాళ్లు అడ్డంపెట్టిన అరాచకశక్తులపై చర్యలు తీసుకోకుండా.. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై కేసులు పెట్టారని, పోలీసులకు చేతకాకపోతే ఉద్యోగం వదిలేయాలని సూచించారు.

 

సీఎం జగన్‌కు కనీసం గౌరవం ఇవ్వడం తెలియదని ఆరోపించారు. వడ్డీతో సహా చెల్లించే రోజు తొందర్లోనే వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీ మాయసభను మరిపిస్తోందన్నారు. కౌరవులు ఆ పక్కన ఉన్నా.. పాండవులే గెలుస్తారని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో ఇష్టానుసారంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదని మారే అవకాశాలు కూడా ఉంటాయని ఎప్పుడు అధికారంలో ఉంటామని కలలు కనకూడదు అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రస్తుత ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: