రైతులకు ఎప్పుడైనా ఎదురయ్యే సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతుంది. రాజ్యాలు మారిన ప్రభుత్వాలు మారిన రైతుల పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కవిదంగా ఆడు కుంటూనే ఉంటుంది అవి  వాతావరణం మరియు రాజకీయ పరిస్థితులు మరియు కొనుగోలు ధర ఇలాంటివి రైతులను నిరాశ పరుస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కోసం భూములిచ్చిన వేల మంది రైతులు ఆందోళనలు తమ ప్రాంతంలో రాజధాని ఉంటుందని భావించి తమ భూములను త్యాగం చేశామని ఆవేదనను వ్యక్తం చేస్తున్న వాళ్ళు కొందరైతే ఉన్నదాంట్లో పండించిన పంటకు మంచి ధర లేక కొందరు బాధపడుతున్నారు.

ఎలాంటి అవినీతికి తావు లేకుండా దాదాపు 45 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా వ్యవసాయ సాయంగా  డబ్బును జమచేశామనితెలుపుతున్న  పంటను కొనుగోలు ప్రక్రియను తొందరగా పూర్తిచేయాలని కోరుతున్నారు  అలాగే మరో లక్షా 20 వేల రైతు కుటుంబాల రైతు వివరాలను సరిచూసేందుకు ఆర్టీజీఎస్‌కు సమాచారం ఇచ్చామని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని  మెంటాడ మండలంలోని జక్కువలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. మిల్లర్లు తప్పనిసరిగా పాలిష్‌ యంత్రాన్ని  కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. పాలిష్‌ యంత్రాన్ని కొనుగోలు చేయడంతోపాటు ఎంతమేరకు ధాన్యాన్ని కొననున్నారో అందుకు తగ్గట్టుగా ముందుగా మిల్లర్లు, ధాన్యానికి సరిపడేలా సొమ్మును డిపాజిట్‌ చేయాలి.  ఇలాంటి నిబంధన ఉండడంతో మిల్లర్లు  ధాన్యం కొనుగోలుకు  ముందుకు రాలేదు. 

రైతులు అహర్నిశలు శ్రమించి పొలాల్లో ఉన్న పంటను కల్లల్లోకి తెచ్చి శుద్ధి  చేసి ధాన్యాన్ని రాశులలాగా పోసి  నిల్వచేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేందుకు ధాన్యం రాసులను సిద్ధం చేశారు. కాని మిల్లర్లు ఎవ్వరూ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాకపోవడంతో రైతులు దిగాలుగా దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చర్య తీసుకొని ఈ సమస్యకు పరిస్కారం చూపాలని వేడుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: