గడిచిన 2014 ఎన్నికల సమయంలో బాబోరు ఇచ్చిన ప్రధాన హామీలైన ఆంధ్రకు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు వంటివి పూర్తిగా తుంగలో తొక్కి, తన అనునాయులకు అడ్డగోలుగా అమరావతిలో భూములు కట్టబెట్టడం, అలానే కొందరు మంత్రులు, ఎమ్యెల్యేలు, ప్రజా పాలనను ప్రక్కత్రోవ పట్టించినప్పటికీ కూడా ఏ మాత్రం చూసి చూడనట్లు తెలివిగా వ్యవారించారు. పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడడంలేదు అనుకున్న విధంగా పాలన సాగించిన బాబొరికి, మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి చావు దెబ్బ కొట్టారు. ఇక రాను రాను పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోవడం, అలానే ప్రధాన నేతలు చాలా మంది ఇతర పార్టీల బాట పడుతుండడంతో బాబొరికి ప్రస్తుతం నిదుర పట్టని పరిస్థితి నెలకొని ఉంది. 

 

నిజానికి ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కున్న తరువాత మెల్లగా ఆ ఫ్యామిలీ వారిని ఎవ్వరినీ కూడా బాబు దగ్గరకు రానివ్వలేదు. అయితే మధ్యలో 2009 సమయంలో ఎన్నకల ప్రచారానికి జూనియర్ ని ఒక పావుగా వాడుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పలేదు. అనంతరం పార్టీలోని నాయకులు మరియు ప్రజల ఒత్తిడి మేరకు బావ బాలకృష్ణను పార్టీలోకి తీసుకున్నారు బాబు. ఇక ఇప్పుడు పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోతుండడంతో, బాబొరికి నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే దిక్కుగా మారినట్లు తెలుస్తోంది. ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో మంచి దిట్టగా చక్రం తిప్పగల సత్తా ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ కు మాత్రమే ఉందనేది ఒప్పుకోవల్సిన వాస్తవం. 

 

అయితే మొదటి నుండి ఆ ఫ్యామిలీ వాళ్ల‌ను ఎలా వాడుకుని వ‌దిలేయాలో బాబోరికి బాగా తెలుస‌న్న అభిప్రాయం అంద‌రిలోనూ ఉంది. మరి తమకు అన్ని విధాలా ఆశాజనకంగా మారిన తారక్ ని పార్టీ పూర్వ వైభవం కోసం బాబు ఆహ్వానిస్తారా, ఒకవేళ మావయ్య ఆహ్వానం మేరకు తారక్ వచ్చినా, కొన్నాళ్ళకు ఆయనను వాడుకుని మళ్ళి వదిలేయారన్న నమ్మకం ఏంటని కొందరు నందమూరి ఫ్యాన్స్ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మరి బాబొరి మనసులో ఏముందో ఏమో ఆ భగవంతుడికే ఎరుక.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: