కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని రాయలసీమ న్యాయ వాదులు స్వాగతిస్తున్నారు. హైకోర్టుకు కర్నూలులో అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. రాజధాని కోల్పోయామన్న బాధ నుంచి కాస్త ఉపశమనం దక్కుతుందంటున్నారు. 

 

కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని రాయలసీమ జిల్లాల ప్రజలు, న్యాయవాదులు స్వాగతిస్తున్నారు. గతంలో రాజధానిని కోల్పోయామన్న బాధ నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ జిల్లాల్లో న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కర్నూలులో 97 రోజులుగా విధులను బహిష్కరించి మరీ న్యాయవాదులు నిరవధిక ఆందోళన చేస్తున్నారు. ఎట్టకేలకు సీఎం జగన్ ప్రకటనతో న్యాయవాదుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


ఏపీలో  మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చని సిఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అందులో కర్నూలులో జుడిషియల్ రాజధాని ఏర్పాటు చేయవచ్చన్నారు జగన్. అంటే హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయవచ్చన్నారు. అయితే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అన్ని హంగులు ఉన్నాయా...కర్నూలుకు ఆ అర్హత ఉందా...కర్నూలులో సౌకర్యాలు ఉన్నాయా....అంటే అవుననే సమాధానమే వస్తుంది. 1953 వరకు కర్నూలు ఆంధ్రుల తొలి రాజధానిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కర్నూలు రాజధానిగా ఉన్నపుడు టెంట్లలో పనిచేశారని గుర్తు చేశారు. అందుకే గుడారాల రాజధాని అనేవారని గుర్తు చేస్తున్నారు. 


ఇప్పటికిప్పుడే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినా అందుకు అవసరమైన సౌకర్యాలు కర్నూలులో ఉన్నాయి. కర్నూలు నగరానికి 20 కి.మీ దూరంలో గత ఏడాది ఎయిర్ పోర్టు కూడా ప్రారంభించారు. కొన్ని అనుమతులు వస్తే ప్రయాణీకుల విమానాలను కూడా ప్రారంభించేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ కు కేవలం 200 కి.మీ దూరంలోనే ఉంది. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు జాతీయ రహాదారి ఉంది. జాతీయ రహదారి 40, 44 కర్నూలు మీదుగానే వెళ్తాయి. రైల్వే కనెక్టివిటీ కూడా కర్నూలుకు ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: