అగ్రి ఇన్‌పుట్‌ కేంద్రాలపై సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు  వెల్లడించారు. గిరిజనుల్లో ఎవరైనా రైతు భరోసా పథకం అందకుండా మిగిలిపోతే ఈ నెలాఖరులోగా గుర్తించేందుకు గడువు పెంచాలని సీఎం ఆదేశించారు.

 

అన్ని సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ఇన్‌ఫుట్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు అక్కడికి వచ్చి విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేయవచ్చు. రైతులు కోరుకున్న ఎరువులు, విత్తనాలు 48 గంటల్లో అందజేస్తాం. గ్రామాల్లో నాలెడ్జ్‌ కేంద్రాలుగా మార్చాలని సీఎం వైయస్‌ జగన్ ఆదేశించారు.  ఇన్‌ఫుట్స్‌ను విక్రయించడంతో పాటు భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.  విత్తనాలు అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

 

దశల వారిగా పంట ఉత్పత్తి కేంద్రాలుగా వీటిని మార్చే ఆలోచన ఉంది. బయో కెమికల్స్‌ పరీక్ష లేకుండా రైతులకు అందడానికి వీల్లేదు పశుదానాను కూడా రైతులకు అందజేసే అవకాశాలు కల్పిస్తున్నాం.  అక్వా ఫీడ్‌కు నాణ్యత పరీక్షలు లేవు. దాని కోసం త్వరలోనే నాణ్యత పరీక్షలు చేసేందుకు ఒక చట్టం చేసేలా సీఎం ఆదేశించారు.

 

అగ్రి ఇన్‌ఫుట్‌, అగ్రి వర్క్‌ షాపుల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అవగాహన కల్పించాల్సి ఉంది. పంటల భీమా, పశు బీమా నమోదును ఈ కేంద్రాల్లోకి తీసుకువస్తాం. వీటితో పాటు గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, యానిమల్‌ హస్బండరీ అసిసెంట్‌ ఇక్కడే ఉండి సేవలందిస్తారు.

 

రైతులకు అన్ని అందుబాటులో ఉండేలా వీటిని సమీకృత కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నాం. వీటికి సంబంధించి ప్రోక్యూర్‌మెంట్‌కు సంబంధించి సీఎం ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్‌లో ఎంత ధర ఉందో ఈ సెంటర్లో ఏర్పాటు చేస్తాం. రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్ర వ్యవసాయంలో కీలకపాత్ర పోషించనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: