కర్నూలులో ఇప్పటికిప్పుడు హైకోర్టు ఏర్పాటు చేయాల్సి వస్తే భవన సముదాయాలు సిద్ధంగా ఉన్నాయి. శాశ్వత నిర్మాణాలకు అవసరమైన స్థలం కూడా ఉంది. హైకోర్టు ఏర్పాటు కోసం మూడు నెలల క్రితమే స్థల పరిశీలన చేశారనే ప్రచారం ఉంది. వాస్తవంగా మూడు నెలల క్రితం నుంచి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ప్రచారంలో ఉంది. 

 

శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు నిర్మాణానికి కర్నూలులోనే దాదాపు 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఎపిఎస్పీ 2వ బెటాలియన్ స్థలం ఉంది. ఎపిఎస్పీ బెటాలియన్ ను కర్నూలు నుంచి తరలించి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఉంది. ఈ స్థలం హైకోర్టు నిర్మాణానికి అనువుగా ఉంటుంది. జాతీయ రహదారి 44 కి ఆనుకునే ఈ బెటాలియన్ ఉంటుంది. ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్య కూడా ఉండదు. అందులో మంచి సౌకర్యాలు ఉన్న భవనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 

 

హైకోర్టు భవనాలు శివారు ప్రాంతంలో నిర్మించాలనుకుంటే కర్నూలుకు 20 కిమీ దూరంలో ఉన్న ఓర్వకల్లు మండలంలో ప్రభుత్వ భూమి చాలా ఉంది. ఇప్పటికే ఓర్వకల్లులో విమానాశ్రయం, ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్ డీఓ , సోలార్ పార్క్ వంటి సంస్థలు ఉన్నాయి. వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. 40 జాతీయ రహదారి పక్కనే ఓర్వకల్లు ప్రాంతం ఉంది. 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు నిర్మాణానికి ఎంత భూమి అయినా కేటాయించవచ్చు. 

 

ఇప్పటికిప్పుడే హైకోర్టును కర్నూలుకు తరలించాల్సి వస్తే భవన సముదాయాలు సిద్ధంగా ఉన్నాయి. కర్నూలుకు 10 కి.మీ దూరంలో హైదరాబాద్-బెంగుళూరు 44వ జాతీయ రహదారి ఆనుకునే కొట్టం ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు ఉన్నాయి. కొట్టం ఇంజనీరింగ్ కాలేజి భవన సముదాయం ఉంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీ మూతపడి ఉంది. ప్రస్తుతం ఒక ఐటి కంపెనీ కాలేజీలోనే నిర్వహిస్తున్నారు. హైకోర్టు నిర్వహణకు అవసరమైన భవనాలు ఉన్నాయి. స్వల్ప మార్పులతో కోర్టు హాళ్లు ఏర్పాటు చేయవచ్చు. ఈ భవన సముదాయాన్ని గతంలో పరిశీలించారనే ప్రచారం ఉంది. 40వ జాతీయ రహదారిపై మూతపడిన సఫా ఇంజనీరింగ్ కాలేజి భవన సముదాయం కూడా అందుబాటులో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: